గుంటూరు : సరస్వతి సిమెంట్స్ వ్యవహారంలో ఎట్టకేలకు టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులలో కదలిక వచ్చింది. గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, బండ్ల నర్సింహారావు సహా 30మందిపై కేసు నమోదు చేశారు.
సరస్వతి సిమెంట్స్ సొంత భూముల్లో అక్రమంగా ప్రవేశించి సిబ్బందిపై దౌర్జన్యం చేశారంటూ కేసు నమోదు అయ్యింది. అయితే కేసు నమోదు వ్యవహారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. తాము తీసుకున్న చర్యలను నివేదిస్తూ పోలీసులు గురువారం హైకోర్టుకు నివేదిక సమర్పించారు.