ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేశ్ హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సినిమాలు (పవన్ సాధినేని, లక్ష్మణ దర్శకత్వాల్లో సినిమాలు ఆన్‌సెట్స్‌లో ఉన్నాయి) కమిట్ అయిన ఈ యువ హీరో తాజాగా తన మూడో చిత్రానికి సోమవారం కొబ్బరికాయ కొట్టారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి హీరో ‘అల్లరి’ నరేశ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు.
ప్రముఖ దర్శకులు తేజ శిష్యుడు రాకేశ్ ఉప్పలపాటి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఎస్.వి2 ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ‘నాంది’ ఫేమ్ నిర్మాత సతీష్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే నెల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కృష్ణచైతన్య కథ, మాటలు, పాటలు అందిస్తున్నారు.
చదవండి : హీరోగా దిల్‌రాజు తమ్ముడి కొడుకు..ఫస్ట్‌లుక్ రిలీజ్
నేను ప్రేమలో పడిపోయా : జగపతి బాబు
Comments
Please login to add a commentAdd a comment