
ఎక్కువగా అల్లరి పాత్రల్లో కనిపించిన అనుపమా పరమేశ్వరన్ అల్లరి చేసే పిల్లలను కంట్రోల్‌లో పెట్టే టీచర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారట. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘రాక్షసన్’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రమేశ్ వర్మ తెరకెక్కిస్తున్నారు.
హవీష్ కోనేరు నిర్మాత. ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్ పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. తమిలో అమలాపాల్ పోషించిన పాత్రను తెలుగులో అనుపమా చేయనున్నారు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన ఈ థ్రిల్లర్ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: వెంకట్ సి. దిలీప్.
Comments
Please login to add a commentAdd a comment