అమ్మాయి చేతి స్పర్శ ఎప్పుడూ సుకుమారమే. అందువల్లే, ప్రేమికుడు ఎప్పుడూ ప్రేయసి చేతిలో చేయ్యేసి పులకరించిపోతాడు. అదే, ఫైటింగ్‌కి వచ్చేవాడైతే... అమ్మాయి చెయ్యి పట్టుకుని చాలా సింపుల్‌గా పక్కకు తోసేస్తారు సిన్మాల్లో! కానీ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో పూజా హెగ్డేను టచ్ చేయడం కాదు, కనీసం చెయ్యి పట్టుకోవాలన్నా విలన్లు భయపడుతున్నారు. ఎందుకంటే... పూజా హ్యాండ్ సాఫ్ట్ కాదు, వెరీ రఫ్.
ఆమెతో ఫైటింగ్ ఇంకా టఫ్! స్కిప్ట్ అండ్ క్యారెక్టర్ ప్రకారం పూజా హెగ్డే కూడా కొన్ని స్టంట్ సీక్వెన్సుల్లో కనిపించనున్నారు. అందుకోసం, హ్యాండ్ టు హ్యాండ్ కొంబాట్, ఫిస్ట్ ఫైట్స్‌లో పూజ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అల్లు అర్జున్ ‘డీజే’తో పాటు గత సినిమాల్లో సుకుమారంగా కనిపించిన ఈ బ్యూటీ, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమాలో ‘చెయ్యి చూశావా... ఎంత రఫ్‌గా ఉందో? రఫ్ఫాడించేస్తా’ వంటి డైలాగులు చేబుతూ ఫైట్స్ చేస్తారన్న మాట!
Comments
Please login to add a commentAdd a comment