
దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఛత్రపతి హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. 2005లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు.
పెన్ స్టూడియోస్ బ్యానర్‌లో తెరకెక్కునున్న ఈ మూవీ శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమౌళి హజరుకానుండటం విశేషం. ఇక త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ మూవీ కోసం శ్రీనివాస్ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి మరింత ఫిట్‌గా అయ్యాడు. మాస్ లుక్‌తో బెల్లంకొండ మరి హిందీ ఆడియన్స్ మెప్పిస్తాడో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment