‘‘శ్రీహరి హీరోగా నటించిన ‘సాంబయ్య’ (1999) సినిమాతో నిర్మాతగా నా ప్రయాణం ప్రారంభమైంది. ప్రొడ్యూసర్‌గా 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇన్నేళ్లలో 38 సినిమాలు చేశాను. ఇండస్ట్రీ నాకు ఎంతో ఇచ్చింది. డబ్బు, పేరు, హోదా అన్నీ ఇక్కడే సంపాదించుకున్నాను. ఈ ప్రయాణం పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని నిర్మాత బెల్లంకొండ సురేష్ అన్నారు.
నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు, నేడు (డిసెంబర్ 5) తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం బెల్లంకొండ సురేష్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో మోహన్‌బాబుగారు నాకు గాడ్ ఫాదర్. నాకు ఎవరూ సపోర్ట్ లేనప్పుడు ఆయన తన సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్‌ని చేశారు. శ్రీహరిగారితో తీసిన ‘సాంబయ్య’ 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే శ్రీహరిగారు, ఆ సినిమా డైరెక్టర్ కేఎస్ నాగేశ్వర రావుగారు మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉంది.
శ్రీహరిగారు మంచి నటుడే కాదు గొప్ప వ్యక్తి కూడా. ఒక ఫ్రెండ్‌గా ఆయన పిల్లల భవిష్యత్‌కి నా వంతు బాధ్యతగా అవసరమైనప్పుడు చేయూతనిస్తాను. 2015లో వచ్చిన ‘గంగ’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత తొమ్మిదేళ్ల పాటు సినిమా నిర్మించలేదు నేను. మా అబ్బాయిలు సాయి శ్రీనివాస్, సాయి గణేశ్ బయట బ్యానర్లలో సినిమాలు చేస్తున్నారు... అందుకే ఇన్నేళ్లు విరామం ఇవ్వాల్సి వచ్చింది.
శ్రీనివాస్ కెరీర్ సెట్ అయ్యింది. పెళ్లి కూడా కుదిరింది. వచ్చే ఏడాది చేసుకుంటాడు. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు. గణేశ్ తన కెరీర్ సెట్ చేసుకుంటున్నాడు. రెండు మంచి ప్రాజెక్ట్స్ తన చేతిలో ఉన్నాయి. నా రీ ఎంట్రీలో భాగంగా మా అబ్బాయిలతోనే ఫిబ్రవరి, ఏప్రిల్‌లో రెండు కొత్త ప్రాజెక్ట్స్‌ప్రారంభిస్తాను. ఈ రెండు సినిమాలతో కొత్త దర్శకులని పరిచయం చేస్తున్నాను. ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ని 4కే క్వాలిటీలో సిద్ధం చేశాను. రవితేజ బర్త్‌డేకి (జనవరి 26) రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment