ప్రియమణి డైలాగ్ డెలివరీ సూపర్బ్
ప్రియమణి డైలాగ్ డెలివరీ సూపర్బ్
Published Wed, Aug 14 2013 12:10 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
‘‘ఇది చాలా మంచి కథ. వినగానే వెంటనే ఓకే చెప్పేశాను. నాతో ఇంత విభిన్నమైన సినిమా చేయిస్తున్న సముద్రకు ధన్యవాదాలు. ఇందులో నేను కృష్ణంరాజుగారి అమ్మాయిగా నటిస్తున్నాను’’ అని ప్రియమణి చెప్పారు. ప్రియమణి ప్రధాన పాత్రలో సముద్ర దర్శకత్వంలో ఓమిక్స్ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ జి.శ్రీనుబాబు నిర్మిస్తున్న ‘చండి’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్లో జరిగింది.
పాటల సీడీని బెల్లంకొండ సురేష్ ఆవిష్కరించి, కృష్ణంరాజుకు అందించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ -‘‘ఈ నిర్మాతలు నాకు బాగా నచ్చారు. ఇలాంటి నిర్మాతల అవసరం చిత్ర పరిశ్రమకు ఎంతైనా ఉంది’’ అన్నారు. సముద్ర మాట్లాడుతూ -‘‘అల్లూరి సీతారామరాజులాంటి గొప్ప పాత్రను ఇందులో కృష్ణంరాజు చేశారు.
ప్రియమణి అభినయం, డైలాగ్ డెలివరీ సూపర్బ్. అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో, ఆగ్రహం వస్తే చండీలాగా మారుతుందనేది ఈ సినిమా కథ’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా బి.గోపాల్, సందీప్కిషన్, రమేష్ పుప్పాల, రవికుమార్ చౌదరి, శ్యామలాదేవి, శ్రీనివాస్, సత్య ముమ్మిడి, ఈశ్వర్రెడ్డి, మనోజ్ నందం తదితరులు మాట్లాడారు.
Advertisement
Advertisement