అన్నయ్య అడిగితే తమ్ముడు కాదంటాడా!
మాస్... రాఘవా లారెన్స్ అంటేనే మాస్! హీరోలతో ఆయన వేయించే స్టెప్పులైనా... దర్శకుడిగా ఆయన తీసిన సినిమాలైనా మాసే. ఇప్పుడీయన ‘అల్లుడు శీను’తో ఇండస్ట్రీలో హీరోగా ఫస్ట్ స్టెప్ వేసిన బెల్లంకొండ శ్రీనివాస్ కోసం మాంచి మాస్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట! లారెన్స్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హారర్ థ్రిల్లర్ ‘కాంచన’ను తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి, నిర్మాత బెల్లంకొండ సురేష్ దాదాపు ఐదేళ్ల క్రితం విడుదల చేశారు. అప్పటినుంచి ఇద్దరూ చాలా క్లోజ్. సురేష్‌ను లారెన్స్ ‘అన్నయ్యా’ అని పిలుస్తారు. తన కుమారుడితో మాంచి మాస్ సినిమా తీయమని బెల్లంకొండ సురేశ్ అడగడం, ఈ స్టార్ కొరియోగ్రాఫర్ వెంటనే ఓకే చెప్పడం జరిగాయని ఫిల్మ్‌నగర్ టాక్.