యువకుడిని ఢీకొన్న బెల్లంకొండ కారు | producer bellamkonda suresh's car dashes youth | Sakshi
Sakshi News home page

యువకుడిని ఢీకొన్న బెల్లంకొండ కారు

Apr 24 2015 2:59 PM | Updated on Sep 29 2018 5:33 PM

యువకుడిని ఢీకొన్న బెల్లంకొండ కారు - Sakshi

యువకుడిని ఢీకొన్న బెల్లంకొండ కారు

ఫిలింనగర్ లోని రోడ్ నెంబర్ 7లో గుర్తుతెలియని యువకుడిని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారు ఢీకొంది.

ఫిలింనగర్ లోని రోడ్ నెంబర్ 7లో ఓ యువకుడిని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారు ఢీకొంది. అతడి పరిస్థితి విషమంగా ఉంది. దాంతో ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అతడు ఫిలింనగర్ బస్తీకి చెందినవాడుగా గుర్తించారు. అదుపు తప్పిన కారు జనం మీదకు దూసుకెళ్లిపోయింది. అందులో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.



ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. బెల్లంకొండ సురేష్ కార్యాలయంపై దాడి చేశారు. ఆయన కార్యలయానికి ఉన్న అద్దాలను ధ్వంసం చేశారు. కాగా, ఈ ఘటన జరిగిన వెంటనే కారు నడుపుతున్న డ్రైవర్ మాత్రం పరారైపోయినట్లు తెలిసింది. బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో కారు డ్రైవర్పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement