సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి, నిర్మాత బెల్లంకొండ సురేష్ మీద చీటింగ్ కేసు నమోదైంది. సినిమా తీయడానికి డబ్బులు అవసరమంటూ తన దగ్గర నుంచి రూ.85 లక్షలు తీసుకుని ఇప్పటికీ తిరిగి ఇవ్వడం లేదంటూ బంజారాహిల్స్‌కు చెందిన శరణ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.
సినిమా నిర్మిస్తున్నానంటూ బెల్లంకొండ సురేష్ 2018లో రూ.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడని, ఆ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో మరో సినిమా అంటూ మరోసారి నమ్మించి డబ్బు తీసుకున్నాడని శరణ్ ఆరోపించాడు. ఇలా తన దగ్గర నుంచి మొత్తంగా రూ.85 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశించడంతో పోలీసులు నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చదవండి: క్యారెక్టర్ ఆర్టిస్టుపై లైంగిక దాడి, ఇద్దరు నిందితుల అరెస్ట్
'20 కోట్ల రూపాయలిస్తా, నన్ను పెళ్లి చేసుకుంటావా?'' ప్రపోజల్‌కు ఓకే చెప్పిన హీరో
Comments
Please login to add a commentAdd a comment