బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఎన్నో మంచి చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన మొదటి కుమారుడు శ్రీనివాస్ టాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరోగా టాలీవుడ్‌కి పరిచయం కానున్నాడు. అతనే ఆయన రెండో కుమారుడు బెల్లంకొండ గణేశ్.
కాగా బెల్లంకొండ గణేశ్ హీరోగా రుపొందుతున్న ‘స్వాతిముత్యం’ ఫస్ట్‌లుక్ విడుదలయింది. గణేశ్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం (సెప్టెంబర్ 14)న ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా చేస్తుండగా.. లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటించొచ్చు. అయితే వి.వి. వినాయక్ దర్శకత్వంలో తొలి తెలుగు సినిమా చేసిన బెల్లంకొండ శ్రీనివాస్.. త్వరలో ఆయన డెరెక్షన్‌లోనే ‘ఛత్రపతి’ రీమేక్ ద్వారా బాలీవుడ్‌కి పరిచయం కానున్నాడు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
Wishing you all the success and happiness this year and all the years coming ahead! Congratulations on your new project! 🤗#GaneshBellamkonda #SwathiMuthyam @VarshaBollamma @Lakshmankkrish2 #mahathi_sagar @dopSURYAA #vamsi84 @NavinNooli @SitharaEnts pic.twitter.com/muLNWlgqkM
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) September 14, 2021
Comments
Please login to add a commentAdd a comment