హీరోయిన్ సమంత అనారోగ్యానికి గురైనప్పుడు రూ.25 లక్షల ఆర్థిక సాయం చేశానంటున్నాడు నిర్మాత బెల్లంకొండ సురేశ్. తాను చేసిన సాయాన్ని సామ్ ఎప్పటికీ మర్చిపోలేదని చెప్తున్నాడు. నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న బెల్లంకొండ సురేశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సమంత మా ఇంటిమనిషిలాగే! మాతో మూడు సినిమాలు చేసినప్పుడు మా ఇంటి నుంచే క్యారేజీ వెళ్లేది.
ఎవరూ సాయం చేయలేదు
అప్పట్లో తనకు చర్మ వ్యాధి సోకింది. అప్పుడు నేనే సాయం చేశాను. బయటకు వెళ్తే ఇబ్బంది అవుతుందని చెప్పి తనకు సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్ తీసుకుని అక్కడే ఉంచాను. ట్రీట్‌మెంట్ కోసం డబ్బు కావాలని పలువురు నిర్మాతలకు ఫోన్ చేసింది.. కానీ ఎవరూ స్పందించలేదు.
నాలుగు నెలల్లో కోలుకుంది
దాంతో నేనే చికిత్స కోసం రూ.25 లక్షలు ఆర్థిక సాయం చేశాను. మూడు, నాలుగు నెలలపాటు విశ్రాంతి తీసుకున్నాక తన ఆరోగ్యం కుదుటపడింది. నేను చేసిన సాయం సమంత మనసులో బలంగా ఉండిపోయింది' అని పేర్కొన్నాడు. కాగా బెల్లంకొండ సురేశ్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయమైన అల్లుడు శ్రీను మూవీలో సమంత హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే! ఇకపోతే సమంత రెండేళ్లుగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment