‘ఒక్కసారి నాది అనుకుంటే ప్రాణం ఇచ్చేస్తా’ | Bellamkonda Sreenivas Alludu Adhurs Trailer Released | Sakshi
Sakshi News home page

‘అల్లుడు అదుర్స్’ ట్రైలర్‌ రిలీజ్‌

Published Tue, Jan 5 2021 6:46 PM | Last Updated on Tue, Jan 5 2021 8:47 PM

Bellamkonda Sreenivas Alludu Adhurs Trailer Released - Sakshi

టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘అల్లుడు అదుర్స్‌’.. నభా నటేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌, సోనూసూద్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేది దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్‌ను వేగవంతం చేసింది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం అల్లుడు అదుర్స్‌ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 2 నిమిషాల 10 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్‌లో డైలాగులు, కామెడీ, థ్రిల్లర్‌, యాక్షన్‌, పాటలు, లవ్‌ ట్రాక్‌ ఇలా నవ రసాలు కలిపి చూపించారు. ట్రైలర్‌ చూస్తుంటే సినిమాపై అంచనాలను మరింత పెంచేలా కనిపిస్తోంది. చదవండి: అంతకు మించిన కిక్‌ ఏముంటుంది?

ట్రైలర్‌ అంతా పూర్తిగా అల్లుడైన బెల్లంకొండ శ్రీనివాస్‌ పాత్ర చుట్టే ఉండటంతో హీరో క్యారెక్ట‌రైజేష‌న్ చూపించే ప్రయత్నం చేశారు. అయితే ‘ఒక్కసారి నాది అనుకుంటే నా ప్రాణం ఇచ్చేస్తా. జాన్ దేదూంగా... పద్దతిగా ట్రై చేస్తే ఏ అమ్మాయి అయినా పడాల్సిందే కదండి. నా కూతురు ప్రేమ వాడి పాలిట చావు. శీనుగాడు నా ఫ్రెండు.. యాక్ష‌న్ సీక్వెన్స్‌లో వాడిది సెప‌రేట్ ట్రెండు.. ఇక్క‌డ హ్యాష్ ట్యాగ్స్ లేవ‌మ్మా’.. అని చెప్పే పలు డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని అనివార్య‌మైన కార‌ణాల వ‌ల్ల‌ ల‌వ్ అంటే నాన్సెస్ అని ఫీల‌య్యే అబ్బాయి.. ప్రేమ‌లో ప‌డితే ఎలా ఉంటుంద‌న్న‌ది సినిమా. సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి ఈ సంక్రాంతికి థియేటర్లలో జనాలకు కావాల్సినంత వినోదాన్ని అందించేందుకు ‘అల్లుడు’ సిద్ధమవుతున్నాడు. మరి ఈ  సినిమా ప్రేక్షకులకు ఎంత వరకు నచ్చుతుందో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement