
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేడు (సోమవారం) తన పుట్టిన రోజు సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు.
ఉదయం విఐపి దర్శనంలో కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ నేడు తన పుట్టిన రోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకొన్నానని అన్నారు. ప్రస్తుతం హాట్ టాఫిక్గా మారిన సినిమా టికెట్లు ధరలపై స్పందించడానికి నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment