
బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఛత్రపతి’. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకి వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. నుష్రత్ బరుచ్చా హీరోయిన్‌గా నటించారు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ (2005)ని అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు.
డాక్టర్ జయంతి లాల్ గడా సమర్పణలో పెన్ స్టూడియోస్‌పై ధవల్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్.
‘‘తెలుగు ‘ఛత్రపతి’ సినిమా బ్యాక్‌డ్రాప్‌ని మార్చి, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా హిందీ ‘ఛత్రపతి’ని తెరకెక్కించారు వినాయక్. శ్రీనివాస్ రగ్డ్ అండ్ మాస్ లుక్‌లో కనిపిస్తాడు. భావోద్వేగ సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించాడు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: నిజార్ అలీ షఫీ, సంగీతం: తనిష్క్ బాగ్చి, వరల్డ్ వైడ్ విడుదల: పెన్ మరుధర్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్.
Comments
Please login to add a commentAdd a comment