BSS12: నాలుగువందల ఏళ్ల నాటి గుడి కథతో వస్తున్న బెల్లంకొండ హీరో! | BSS12: Bellamkonda Sai Sreenivas Announced Pan India Film | Sakshi
Sakshi News home page

BSS12: నాలుగువందల ఏళ్ల నాటి గుడి కథతో వస్తున్న బెల్లంకొండ హీరో!

Published Wed, Jul 24 2024 11:09 AM | Last Updated on Wed, Jul 24 2024 11:30 AM

BSS12: Bellamkonda Sai Sreenivas Announced Pan India Film

ఓ పురాతన గుడి ముందు తుపాకీ పట్టుకుని నిల్చున్నారు హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌. ఆ గుడి నాలుగువందల ఏళ్ల క్రితం నాటిది. ఆ గుడికి హీరో ఎందుకు వెళ్లాలనుకుంటాడు? అనేది తెలుసుకోవడానికి కాస్త సమయం ఉంది. 

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా లుధీర్‌ బైరెడ్డి దర్శకత్వంలో మహేశ్‌ చందు ఓ సినిమాను నిర్మిస్తున్నారు. దివంగత ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ 75వ జయంతి, హీరో శ్రీనివాస్‌ ఇండస్ట్రీలోకి నటుడిగా వచ్చి పదేళ్లు పూర్తి కావడం... ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని ఈ సినిమాను మంగళవారం అధికారికంగా ప్రకటించారు. 

‘‘ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే మొదలైంది. జూలై 24న రెండో షెడ్యూల్‌ను మొదలు పెట్టనున్నాం. కమర్షియల్‌ అంశాలతో కూడిన శక్తివంతమైన, ఆసక్తికరమైన కథను సిద్ధం చేశారు లుధీర్‌’’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: లియోన్‌ జేమ్స్‌.   

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement