సీత వస్తున్నారు | Kajal Aggarwal starrer Sita to release on May 24 | Sakshi
Sakshi News home page

సీత వస్తున్నారు

Published Mon, May 6 2019 3:51 AM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

Kajal Aggarwal starrer Sita to release on May 24 - Sakshi

కాజల్‌ అగర్వాల్‌, బెల్లంకొండ సాయిశ్రీనివాస్

పురాణాల్లో సీత కథ అందరికీ తెలుసు. మరి ఈ సీత కథ ఏంటి? తెలియాలంటే మా ‘సీత’ విడుదల వరకూ ఆగాల్సిందే అంటున్నారు ‘సీత’ చిత్రబృందం. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్‌ అగర్వాల్‌ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీత’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మించిన ఈ సినిమాను ఈనెల 24న రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘కవచం’ తర్వాత సాయిశ్రీనివాస్, కాజల్‌ జంటగా నటించిన చిత్రమిది. సాయి శ్రీనివాస్‌ సరికొత్త పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో సోనూసూద్‌ నెగటివ్‌ రోల్‌ పోషించారు. పాయల్‌ రాజ్‌పుత్‌ స్పెషల్‌ సాంగ్‌ చేశారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌ గరికపాటి, సహ నిర్మాతలు: అజయ్‌ సుంకర, అభిషేక్‌ అగర్వాల్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement