Seeta
-
చిక్కుల్లో కాంగ్రెస్ నేత.. వీడియో వైరల్
దేశంలో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీనీ వీడుతున్నారు. మరోవైపు.. బీజేపీపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్ధలను, ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు ఏజెన్సీలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని అన్నారు. ఈ క్రమంలో మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణాన్ని ప్రస్తావించబోయి పొరపాటున సీతాదేవి పేరును చెప్పడం వివాదాస్పదంగా మారింది. అయితే, రాజ్యాంగ వ్యవస్ధలను నిర్వీర్యం చేస్తూ వాటి ప్రాధాన్యతకు కేంద్రం తూట్లుపొడుస్తోందని సూర్జేవాలా ఆరోపించారు. ఈ క్రమంలో సీతాదేవి వస్త్రాపహరణం తరహాలోనే బీజేపీ ప్రజాస్వామ్య విలువలను ఊడదీయాలని కాషాయ పార్టీ కోరుకుంటోందని రణ్‌దీప్ దుయ్యబట్టారు. బీజేపీ ప్రయత్నాలు ఫలించబోవని, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని ఆయన కామెంట్స్ చేశారు. కాగా, కౌరవ సభలో పాండవుల సమక్షంలో ద్రౌపది వస్త్రాపహరణం గురించి ప్రస్తావించబోయిన సుర్జేవాలా పొరపాటున సీతాదేవీ పేరును పలికారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఇక, సూర్జేవాలా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #WATCH | Udaipur, Rajasthan | "..Truth, democracy, law & morals will win. BJP wants to do 'cheer haran' of democracy, just like 'cheer haran' of Goddess Sita. But they'll lose (in RS polls) & their masks will fall off," Congress leader Randeep Surjewala said in a press conference pic.twitter.com/xYXk2N5uJf — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 9, 2022 ఇది కూడా చదవండి: రాజ్యసభ ఎన్నికలు: ఎన్సీపీ నేతలకు షాక్.. -
రావణా! నిన్ను చంపింది రాముడు కాదు!
సాధారణంగా ఎటువంటి స్త్రీఅయినా తట్టుకోలేని శోకం ఎప్పుడు అనుభవిస్తుందంటే... భర్త అలాగే కడుపున పుట్టిన కొడుకు దిగజారిపోయినప్పుడు... ఆ దుఃఖానికి అవధి ఉండదు. మండోదరి మహా పతివ్రత. మయుడు, హేమల కుమార్తె. పది తలలు ఉన్న రావణాసురుని పట్టమహిషి. ఇంత గొప్పది. రావణుడి వక్షస్థలాన్ని చీల్చుకుని, గుండెను ఛేదించుకుని బాణం బలంగా భూమిలోకి దిగి తిరిగి రామచంద్రమూర్తి అక్షయ తూణీరంలోకి ప్రవేశిస్తే నెత్తురోడుతూ రావణుడు భూమ్మీద పడిపోయి ఉంటే... గద్దలు, రాబందులు పైన ఎగురుతుంటే... దేవతలందరూ జయజయధ్వానాలు చేస్తుంటే... మండోదరికి కబురందించి పల్లకి పంపి పిలిపించారు. ఆవిడ యుద్ధభూమికొచ్చింది. రావణుడి శరీరానికి కొద్దిదూరంలో ఒక చెట్టుకింద రామలక్ష్మణులు, పక్కన విభీషణుడు నిలబడి ఉన్నాడు. సాధారణంగా ఆ పరిస్థితులలో ఉన్న ఏ స్త్రీ అయినా వెంటనే... రాముడెక్కడ? అని అడుగుతుంది లేదా తన భర్తను చంపేసాడన్న కోపంతో రాముడిని నింద చేస్తూ విరుచుకుపడుతుంది.. అని అనుకుంటారు. కానీ మండోదరి ఎంత ధర్మాత్మురాలంటే...పల్లకీ దిగి రావణుడి దగ్గరకెళ్ళి... ఏడుస్తూ...‘‘వీళ్లందరికీ అమాయకత్వంతో తెలియని విషయం ఒకటున్నది రావణా! రాముడు నిన్ను చంపాడని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ నీ భార్యను కనుక నాకు తెలుసు... నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే. ఒకానొకనాడు నీవు తాచుపామును తొక్కిపెట్టినట్లు నీ ఇంద్రియాలను తపస్సు కోసం తొక్కిపట్టావు. నువ్వు బలవంతంగా వాటిని కోరికలకోసం తొక్కిపెట్టావు. తొక్కి పెట్టిన కాలుకింద నుంచి తప్పించుకున్న పాములా పగతో నీ ఇంద్రియాలు నిన్ను కాటేసాయి. యుక్తాయుక్త విచక్షణ తెలియలేదు... అయినా నాలోలేని ఏ అందం నీకు సీతమ్మలో కనిపించింది?’’ ఎంత మర్యాదగా మాట్లాడిందో చూడండి. అంత శోకంలో కూడా అలా మాట్లడడం భార్యగా ఒక్క మండోదరికే సాధ్యపడింది. ఎటువంటి నిష్పక్షపాత తీర్పు చెప్పిందో చూడండి! అదీ ఈ జాతివైభవం. ఈ ఒక్కమాట లోకానికి అందితే జాతి చేయకూడని పొరబాట్లు చేయదు. పిల్లలకు పాఠశాలల్లో రామాయణం చెపితే తప్పు, భారత భాగవతాలు చెపితే తప్పు. మంచి శ్లోకం ఉండకూడదు... అన్నప్పుడు సంస్కారం ఎక్కడినుంచి అందుతుంది? ఒక పాత్రలో పాయసం పోశారు. అది రాగిపాత్ర. మరొక బంగారు పాత్రలో పాయసం పోసారు. బంగారు పాత్రలోది తాగినా, రాగిపాత్రలోది తాగినా పాయసానికి రుచి ఒకటే. రాగి పాత్ర నీదయినప్పుడు ధర్మం తప్పకుండా రాగిపాత్రలోనే తాగు. నీది కాని బంగారు పాత్రలోది తాగాలని మాత్రం అలమటించకు. పాత్ర మెరుగులు, మిలమిలలు చూసి గీత దాటితే భ్రష్టుడవయిపోతావు. కొన్ని కోట్ల జన్మలు కిందకు జారిపోతావు. మండోదరిలాంటి స్త్రీల వారసత్వం ఈ జాతి సంపద. ఎక్కడున్నా వాళ్లు భర్తకు శాంతి స్థానాలు. వాళ్ళు భర్తలకు మంచి మాటలు చెప్పారు తప్ప భర్త పరిధి దాటి అక్కరలేని విషయాల జోలికి వెళ్ళి పైపై మెరుగులకోసం, తాత్కాలిక సుఖాలకోసం కష్టాలను కౌగిలించుకోవాలని ఎన్నడూ ప్రబోధం చేయలేదు.. -
సీత వస్తున్నారు
పురాణాల్లో సీత కథ అందరికీ తెలుసు. మరి ఈ సీత కథ ఏంటి? తెలియాలంటే మా ‘సీత’ విడుదల వరకూ ఆగాల్సిందే అంటున్నారు ‘సీత’ చిత్రబృందం. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీత’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాను ఈనెల 24న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘కవచం’ తర్వాత సాయిశ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన చిత్రమిది. సాయి శ్రీనివాస్ సరికొత్త పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో సోనూసూద్ నెగటివ్ రోల్ పోషించారు. పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్ చేశారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, సహ నిర్మాతలు: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్. -
అపహాస్యం తెచ్చిన అనర్థం
సీతని ఎవరో రాక్షసుడు అపహరించాడని జటాయువు ద్వారా తెలుసుకున్న రామలక్ష్మణులు ఆమెకోసం వెతుకుతూన్న సమయంలో వారికి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. అదేంటో తెలుసుకోవాలని ప్రయత్నించేలోగా ఒక విచిత్రమైన, వికృతమైన ఆకారం వారికి కనిపించింది. ఆ ఆకారానికి తల, కాళ్ళు లేవు. నుదురు వంటి భాగం ఛాతీలోనూ, ముఖం వంటి ఒక భాగం పొట్ట వద్ద, అక్కడే అగ్నిజ్వాలలా ఎర్రగా ఉన్న ఒక కన్ను, ఆ కంటికి ఒక పెద్ద రెప్ప ఉన్నాయి. ఆ ఆకారం చేతులు ఒక యోజనం పొడవుగా ఉన్నాయి. చూస్తుండగానే ఆ ఆకారం తన రెండు చేతులతో వారిని పట్టుకుని, తినడానికి సంసిద్ధమయింది. వెంటనే రాముడు ఆ ఆకారం కుడిచేతిని, లక్ష్మణుడు ఎడమచేతినీ ఖండించి వేశారు. వారలా చేయగానే ఆ ఆకారం సంతోషంతో ‘మీరు రామలక్ష్మణులు కదా,’ అని అడిగింది. రామలక్ష్మణులు ఆశ్చర్యంతో ‘‘ఎవరు నీవు? నీకీ ఆకారం ఎలా వచ్చింది?’’ అని అడిగారు. ఆ ఆకారం ఇలా చెప్పింది. ‘నేను ధనువు అనే గంధర్వుడిని. అత్యంత సుందరమైన శరీరం కలిగిన వాడిని.ఆ అందం వల్ల కలిగిన గర్వంతో నా కామరూప శక్తి చేత విచిత్రమైన రూపాలు ధరించి ఋషులను, మునులను భయ కంపితులను చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు ఒక ఋషికి ఈరోజు నేను ఉన్న ఈ రూపంతో కనిపించాను. సర్వజ్ఞుడైన ఆ రుషి ‘నీకు ఇటువంటి భయంకరమైన, జుగుప్సాకరమైన రూపం ఇష్టంలా అనిపిస్తున్నది కనుక నువ్వు ఎప్పటికీ ఈ రూపంతోనే ఉందువు గాక’ అని శపించాడు. శాపవిమోచనం చెప్పమని ప్రాధేయపడ్డాను. ‘నీవు ఈ రూపంతో ఉండగా రామలక్ష్మణులు వచ్చి నీ చేతులు ఖండించి నిన్ను అగ్నిలో దహించిన తర్వాత నీకు నిజరూపం వస్తుంది’ అని సెలవిచ్చాడు. అప్పటినుండి నేను ఈ దారిన వెళ్లే జీవులందరినీ సంహరించి తింటూ, మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరు నా శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తే, నాకు నిజరూపం వచ్చిన తర్వాత మీరు సీతమ్మను వెతకడానికి మార్గం చెప్పగలను’’ అని అన్నాడు. రామలక్ష్మణులు ఒక పెద్ద గొయ్యి తీసి, కబంధుడి శరీరాన్ని ఆ గోతిలోకి నెట్టివేసి, ఎండిన కర్రలను వేసి అగ్నిసంస్కారం చేసారు. ఆ శరీరం కాలగానే ఒక దివ్యపురుషుడు ప్రత్యక్షమై వారికి నమస్కరించి ‘‘రామా! మీరు ఈ విధంగా వెతికితే మీకు పెద్ద ప్రయోజనం ఉండదు. ఈ సమయంలో మీకు ప్రపంచ మంతా చుట్టిన ఒక మిత్రుడు అవసరం. అటువంటి అత్యంత బలవంతుడయిన సుగ్రీవుడనే ఒక వానరరాజు ఉన్నాడు. ఆతను ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు. అతను ఈ భూమిమీద ఎక్కడ ఏమి ఉన్నదో తెలిసిన వాడు. నీవు అతనితో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకో. మంచి జరుగుతుంది’’ అని అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్పి వెళ్ళిపోయాడు. మన అందచందాలు, శక్తి సామర్థ్యాలను చూసుకుని విర్రవీగడం, మనకున్న శక్తులను ఇతరులను అపహాస్యం చేసేందుకు ఉపయోగించడం మిక్కిలి అనర్థదాయకం. – డి.వి.ఆర్. భాస్కర్ -
కబళించిన కేన్సర్
తల్లాడ: రెక్కాడితేనే డొక్కాడే కుటుంబం.. అయినా సాఫీగా సాగుతున్న సంసారం.. ఉన్నంతలోనే ఇద్దరు పిల్లలను గొప్పగా చూసుకునే దంపతులు.. ఎలాంటి చింత లేకుండా ఉన్న వారికి కేన్సర్ రూపంలో పెద్ద కష్టమే వచ్చింది. మూడేళ్ల క్రితం ఆ ఇంటి ఇల్లాలు ఈలప్రోలు సీతకు మాయదారి జబ్బు సోకింది. ఆమెకు చికిత్స చేయించేందుకు ఆ నిరుపేద కుటుంబం ఆర్థికంగా చితికిపోతోంది. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. ఈలప్రోలు సీత, వీరభద్రం దంపతులు.. వీరి గ్రామం తల్లాడ మండలంలోని రంగంబంజర.. వీరభద్రం తల్లాడలో హమాలీగా పని చేస్తున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త వీరభద్రంతో పాటు సీత కుల వృత్తి అయిన బట్టలు ఉతికి, కూలికి వెళ్లేది. కాయ కష్టం చేస్తూ సీత కుటుంబానికి ఆసరాగా ఉండేది. అయితే మూడేళ్ల క్రితం ఆమె కేన్సర్ బారిన పడింది. బ్రెయిన్ ట్యూమర్‌తో ఆమె బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఆమెకు చికిత్స అందించడం కోసం వీరభద్రం తనకున్న అర ఎకరం భూమిని అమ్మాడు. మరో రూ.5 లక్షల వరకు అప్పులు చేసి వైద్యం చేయించాడు.. తలలో గడ్డలు రాగా ఆపరేషన్ చేయించాడు. అయితే ఆ ఆపరేషన్ విజయవంతం కాలేదు. ప్రస్తుతం సీత మంచానికి పరిమితమైంది. కూర్చోలేక.. నిలబడలేక.. జీవచ్ఛవంలా మారింది. సీత ఆరోగ్యం రోజురోజకు క్షీణిస్తుండటంతో భర్త వీరభద్రం హమాలీ పని కూడా మానేసి ఇంటి వద్దే ఉంటూ ఆమెకు సపర్యలు చేస్తున్నాడు. పనికి పోకపోవడంతో సంపాదన లేక.. ఇల్లు గడవడంతోపాటు సీత వైద్యానికి వీరభద్రం నానా అవస్థలు పడుతున్నాడు. తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేశాడు. ప్రతి నెలా సీత వైద్యం కోసం రూ.20 వేలకు పైగా ఖర్చు అవుతున్న పరిస్థితి. దీంతో వైద్యం చేయించే స్థోమత లేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. దాతలు ముందుకొచ్చి ఆర్థికసాయం అందిస్తే తప్పా కుటుంబ పోషణ, వైద్యం చేయించే స్థితిలో అతడు లేడు. ప్రభుత్వం, దాతలు మానవతా దృక్పథంతో సహకరించాలని వీరభద్రం వేడుకుంటున్నారు. ఉన్నదంతా ఖర్చు చేశా రోజు పనిచేస్తేనే కుటుంబం గడుస్తుంది. ఇలాంటి పరిస్థితిలో నా భార్యకు కేన్సర్ సోకింది. ఉన్నదంతా అమ్మి వైద్యానికి ఖర్చు చేశా.. ఆమెను చూసుకోవడానికి పని కూడా మానేశా. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. మూడేళ్లలో రూ. 5లక్షలు అప్పు చేశా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. దాతలు, ప్రభుత్వమే కరుణించాలి.- ఈలప్రోలు వీరభద్రం సహాయం చేయదల్చుకున్న వారు సంప్రదించాల్సిన నంబర్: 9989816405 బ్యాంక్ అకౌంట్ నంబర్: 109810100101786, వీరభద్రం, ఆంధ్రాబ్యాంక్, IFCS Code : ANDB0001098 -
మాజీ భర్తతో సీత
దక్షిణాదిలో పక్కింటి అమ్మాయి ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ తారల్లో నటి సీత ఒకరు. ఆమె తమిళం, తెలుగు భాషల్లో కథానాయకిగా మంచి పేరు తెచ్చుకున్నారు. నటుడు పార్తిబన్‌తో కలిసి పుదియపాదై చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. అలాగే వారిద్దరిని ప్రేమలో పడేసి పెళ్లికి దారి తీసింది. అయితే పార్తిబన్, సీతల ప్రేమ వివాహంలో కొంతకాలం తరువాత ముసలం పుట్టింది. అది విడాకులకు దారి తీసింది. ఆ తరువాత ఇద్దరూ విడివిడిగా జీవిస్తూ నటిస్తున్నారు. అలాంటిది విడిపోయిన ఈ దంపతులను ఒకే చిత్రంలో నటింప చేయడంలో దర్శకుడు ఏఎం ఆర్ రమేష్ సఫలీకృతమయ్యారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఒరు మెల్లియకొడు అర్జున్, శ్యామ్, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ ద్విభాషా చిత్రం (తమిళం, కన్నడం)లో నటి సీతతో పాటు పార్తిబన్ కీలక పాత్రలు పోషిస్తున్నారని తెలిసింది. 25 ఏళ్ల క్రితం పుదియపాదైలో పార్తిబన్‌తో నటించిన సీత తాజాగా ఇప్పుడు ఒరు మెల్లియ కొడు చిత్రంలో నటించడం విశేషం. -
అంగద రాయబారం...
వారధి మీదుగా వానర సైన్యంతో రాముడు లంకకు చేరుకున్న తర్వాత యుద్ధం లేకుండా ఉండేందుకు సీతను తనకు అప్పగించాలంటూ అంగదుడి ద్వారా రావణుడికి రాయబారం పంపుతాడు. రాముడి మాట మేరకు అతడు నానా విధాలుగా రావణుడికి నచ్చజెబుతాడు. రావణుడు యుద్ధంలో తలపడతానే తప్ప సీతను అప్పగించేది లేదని భీష్మిస్తాడు. స్వయంగా యుద్ధంచేసే శక్తిలేక కోతిమూకను వెంటేసుకొచ్చాడంటూ రాముడిని తూలనాడతాడు. రావణుడి వాచాలతకు తిక్క రేగిన అంగదుడు బలప్రదర్శను సిద్ధపడతాడు. రావణుడి వర్గంలో ఎవరైనా తన కాలు కదపగలిగితే చాలు, సీత లేకుండానే రామలక్ష్మణులు సహా వానర సైన్యం ఓటమిని అంగీకరించి వెనుదిరుగుతుందని సవాలు చేస్తాడు. రావణుడి కొడుకు ఇంద్రజిత్ సహా రాక్షస వీరులెవ్వరూ అంగదుడి కాలు కదపలేకపోతారు. ఇక ఉక్రోషం పట్టలేక రావణుడే అంగదుడి కాలు కదపడానికి దగ్గరకు వస్తాడు. అంగదుడు తటాలున కాలు వెనక్కు లాగేసుకొని, రావణుడి కిరీటాన్ని తన్ని గాల్లోకి ఎగురుతాడు. తన కాళ్లపై పడటం కంటే, రాముడి కాళ్లపై పడి శరణు కోరుకోమని హితవు చెబుతాడు. రాక్షస యోధులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేసేలోగానే అక్కడి నుంచి ఎగిరిపోయి, రాముడి వద్దకు చేరుకుంటాడు. ప్రత్యర్థి వద్దకు రాయబారానికి వెళ్లిన దూత సందేశాన్ని మాత్రమే చెప్పి రాకుండా, బలం రుచి చూపించి, బెదిరించి మరీ రావడం అంగద రాయబారంగా వాడుకలో స్థిరపడింది. -
పాతికేళ్ల తర్వాత...
రాజేంద్రప్రసాద్, సీత నటించిన ‘చెవిలో పువ్వు’, ‘ముత్యమంత ముద్దు’ చిత్రాలు అప్పట్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ జంటకు మంచి పేరొచ్చింది. మళ్లీ పాతికేళ్ల తర్వాత ఈ జోడీ ‘టామీ’ సినిమా కోసం కలిశారు. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో చేగొండి హరిబాబు, బోనం చినబాబు నిర్మిస్తోన్న ‘టామీ’ చిత్రం కేవలం నెల రోజుల్లో నర్సాపురం, పాలకొల్లు ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చేగొండి హరిబాబు మాట్లాడుతూ -‘‘కుక్కకూ, యజమానికి మధ్య ఉన్న అనుబంధాన్ని ఇందులో ఎంతో బాగా ఆవిష్కరించాం. మా టామీ అందర్నీ నవ్వించడంతో పాటు, ఆఖరిగా ఆలోచింపజేస్తుంది. తదుపది మేం ‘టామీ-2’ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందు కోసం ఓ కుక్కకు శిక్షణ ఇప్పిస్తున్నాం’’ అని తెలిపారు. కుక్క చేసే విన్యాసాలు ఈ చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: మోహన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబు బండారు. -
నవవధువు కుడికాలే ఎందుకు పెట్టాలి?
నివృత్తం పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చాక కుడికాలు లోపల పెట్టి రమ్మని వధువుకు చెబుతూ ఉంటారు పెద్దలు. ఎడమకాలు పెడితే అశుభాలు జరుగుతాయని అంటారు. దీనికి సాక్ష్యంగా రామాయణంలో హనుమంతుడిని చూపిస్తుంటారు. సీతను అన్వేషిస్తూ లంకకు చేరుకున్న హనుమంతుడు, కావాలని తన ఎడమకాలును మొదట ఆ నేలమీద మోపుతాడు. కుడిపాదం పెడితే రావణాసురుడికి సకల శుభాలు కలుగుతాయనీ, తాను వైరానికే సిద్ధపడి వచ్చాను కాబట్టి ఎడమ పాదం పెట్టడమే మంచిదనీ భావించి అలా చేస్తాడు. అంటే... గొడవకు సిద్ధపడి వచ్చేవారు ఎడమ పాదమే మోపుతారని తెలుస్తోంది. శుభం జరగాలని కోరుకునేవారు ఎవరైనా కూడా కుడి పాదమే మోపాలని అర్థమవుతోంది. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు... ఒక అడవిలో ఓ గాడిద ఉండేది. అది కడుపు నిండా తిండి మేస్తూ, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుండేది. ఓసారి దానికి ఇంకో గాడిద కనిపించింది. ‘నిన్నిక్కడ ఎప్పుడూ చూళ్లేదు, అడవికి కొత్తగా వచ్చావా’ అనడిగింది మొదటి గాడిద. ‘లేదు, మా యజమానీ, నేనూ పట్నం వెళ్లి మా ఊరికి తిరిగొస్తున్నాం, దారిలో ఇక్కడ ఆగాం’ అని చెప్పింది రెండో గాడిద. అక్కడితో ఆపకుండా... ‘ఇక్కడ అడవిలో ఏం బతుకుతావ్, మా ఊరిలో చాలా బాగుంటుంది, నాతో రా’ అంటూ దాన్ని రెచ్చగొట్టింది. అది నమ్మి ఇది కూడా దాని వెనుక బయలుదేరింది. తీరా అక్కడికెళ్లాక యజమాని ఇద్దరితో చాకిరీ చేయించసాగాడు. పైగా తిండి సరిగ్గా పెట్టేవాడు కాదు. దాంతో... అడవిలోనే ఉంటే తిండయినా దొరికేది కదా అని కన్నీళ్లు పెట్టుకుందా గాడిద. ఈ కథను అనుసరించే పై సామెత పుట్టుకొచ్చింది.