రీమేక్‌ మీద కన్నేసిన బన్నీ..! | Allu Arjun Trivikram Srinivas Next To Be Remake Film | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 21 2018 12:52 PM | Last Updated on Sun, Oct 21 2018 12:52 PM

Allu Arjun Trivikram Srinivas Next To Be Remake Film - Sakshi

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో షాక్‌ తిన్న అల్లు అర్జున్‌ కొత్త సినిమాను ప్రారంభించేందుకు చాలా సమయం తీసుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్‌ అయి చాలా రోజులు అవుతున్నా బన్నీ ఇంత వరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. తమిళ దర్శకుడు లింగుసామితో ఒక సినిమా, విక్రమ్‌ కుమార్‌తో మరో సినిమా చర్చల దశలో ఉన్న ఏ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు.

తాజాగా అల్లు అర్జున్‌ ఓ రీమేక్‌ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల బాలీవుడ్‌లో రిలీజ్‌ అయిన సోను కే టిటు కీ స్వీటీ సినిమాను బన్నీ తెలుగులో చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement