
విక్రమ్
‘సామి’ మిషన్ కంప్లీట్ చేయడానికి రెడీ అయ్యారు. కేవలం ఇంకొన్ని రోజుల్లో అప్పగించిన మిషన్‌ను పూర్తి చేస్తారట. హరి దర్శకత్వంలో విక్రమ్, కీర్తీ సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సామీ స్క్వేర్’. 2003లో రిలీజ్ అయిన ‘సామి’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ చిత్రం ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయిందని కోలీవుడ్ టాక్. ఈ షెడ్యూల్‌లో ఓ పాటను కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట దర్శకుడు హరి. ఈ షెడ్యూల్‌తో సినిమా కంప్లీట్ అవుతుంది. ఆగస్ట్‌కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం. ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment