
ధనుష్, కీర్తీ సురేష్
మామగారు రజనీకాంత్ నటించిన చిత్రాల్లో అల్లుడు ధనుష్‌కి బాగా నచ్చిన చిత్రాలు ‘మాపిళ్లయ్’, ‘నెట్రిక్కన్’. వీటిలో ‘మాపిళ్లయ్’ రీమేక్‌లో నటించారు ధనుష్. ఇప్పుడు ‘నెట్రిక్కన్’ రీమేక్‌లో నటించాలనుకుంటున్నారని సమాచారం. ఇక్కడ విశేషం ఏంటంటే... 1981లో విడుదలైన ‘నెట్రిక్కన్’లో రజనీ సరసన ఓ కథానాయికగా కీర్తీ సురేష్ తల్లి మేనక నటించారు. ఆ సినిమాలో మేనక నటనకు మంచి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు ఈ రీమేక్‌లో ధనుష్‌తో కీర్తీ జోడీ కట్టనున్నారని సమాచారం.
ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం ప్రారంభం అవుతుందట. ఎస్.పి. ముత్తురామన్ దర్శకత్వంలో కె. బాలచందర్ ‘నెట్రిక్కన్’ని నిర్మించారు. ఇప్పుడు ధనుష్ తన వండర్‌బార్ బేనర్‌లోనే ఈ చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నారట. దర్శకుడు ఇంకా ఖారారు కాలేదు. ‘నెట్రిక్కన్’ కథ విషయానికి వస్తే.. ఉమనైజర్ అయిన తండ్రి ప్రవర్తనను మార్చాలని తాపత్రయపడే కొడుకు కథ ఇది. తండ్రీకొడుకుల పాత్రలను రజనీయే చేశారు. సో.. రీమేక్‌లో ధనుష్ ఈ రెండు పాత్రలు చేస్తారని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment