విక్రమ్
ముందుకు వెళితే 2726 కిలోమీటర్ల దూరంలో ఢిల్లీ. వెనక్కు తిరిగితే 3 కిలోమీటర్ల దూరంలో తమిళనాడులోని తిరునెల్వేలి. మరి.. విక్రమ్ పయనం ఎటు? అనే ప్రశ్నకు సిల్వర్ స్క్రీన్‌పైనే సమాధానం దొరుకుతుంది. విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సామీ స్క్వేర్’. ఇందులో కీర్తీ సురేశ్ కథానాయిక. ప్రభు గణేశన్, బాబీ సింహా ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌సంగీతం. విక్రమ్, హరి కాంబినేషన్‌లో దాదాపు 15 ఏళ్ల క్రితం వచ్చిన ‘సామీ’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘సామీ స్క్యేర్’ చిత్రం మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోలీసాఫీసర్‌గా విక్రమ్ మార్క్ యాక్షన్ కనిపించనుందని ఈ మోషన్ పోస్టర్‌ను చూసిన సినీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 26న రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే ‘సామీ’ చిత్రం తెలుగు రీమేక్ ‘లక్ష్మీనరసింహా’ మూవీలో బాలకృష్ణ హీరోగా నటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment