
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘జులాయి’ సినిమా హిందీలో రీమేక్‌కి సిద్ధమైంది. జులాయి రీమేక్‌ని సూపర్ డైరెక్టర్ టోని డిసౌజ రూపొందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుందని హిందీ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘రేసుగుర్రం’. ఈ సినిమా కూడా హిందీలో రిమేక్ కానుండగా.. ఇందులో కూడా నమషి చక్రవర్తి హీరోగా నటిస్తుడటం విశేషం. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'బ్యాడ్‌బాయ్'గా పేరు ఖరారు చేసినట్టు తెలిసింది. ఇక ఈ రెండు సినిమాల్లోనూ హైదరాబాద్ అమ్మాయి అమ్రిన్ ఖురేషి హీరోయిన్ కావడం మరో విశేషం.
(చదవండి: సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న ప్రభుదేవా!)
Comments
Please login to add a commentAdd a comment