సెన్సేషనల్ కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి, సీనియర్ హీరోయిన్ త్రిష జంటగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ 96. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అద్భుతమైన రివ్యూస్ రావటంతో పాటు కలెక్షన్ల పరంగా కూడా రికార్డ్‌లు సృష్టించింది. దీంతో ఇతర భాషల్లో 96ను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
ఇప్పటికే ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు రీమేక్ హక్కులు సొంతం చేసుకోగా గోపిచంద్ హీరోగా నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. కన్నడ దర్శకనిర్మాతలు మరో అడుగు ముందుకేసి ఈ రీమేక్ ప్రీ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. గణేష్, భావన హీరో హీరోయిన్లుగా ప్రీతం గబ్బి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 99 అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment