
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, సంజనా సాంఘీ
కొత్త సినిమాను మొదలు పెట్టారు బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్. నాలుగేళ్ల క్రితం వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ సినిమాకు ఇది రీమేక్. ఇంతకముందు దర్శకత్వ శాఖలో పనిచేయడం పాటు, నటుడిగాను సినిమాలు చేసిన ముకేశ్ చబ్రా ఈ సినిమాతో దర్శకునిగా మారారు. ‘రాక్‌స్టార్, హిందీ మీడియం, ఫక్రీ రిటర్స్ ’ సినిమాల్లో కీలక పాత్రలు చేసిన సంజనా సాంఘీ ఈ చిత్రంలో కథానాయిక. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘కొత్త ప్రయాణం మొదలైంది. ముకేశ్ చబ్రా నాకు ఎప్పటి నుంచో తెలుసు. అతనిపై నమ్మకంతో స్క్రిప్ట్ చదవకుండానే సైన్ చేశాను.’’ అని పేర్కొన్నారు సుశాంత్.
Comments
Please login to add a commentAdd a comment