The Fault in Our Stars
-
అంతా అబద్ధం.. నన్నెవరు వేధించలేదు : హీరోయిన్
సుశాంత్ రాజ్‌పుత్ సింగ్, సంజనా సంఘీ జంటగా తెరకెక్కుతున్న హిందీ సినిమా ‘కీజీ ఔర్ మానీ’. నాలుగేళ్ల క్రితం వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ సినిమాకు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాతో నటుడు ముకేశ్ చాబ్రా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో సుశాంత్, సంజనాతో తప్పుగా ప్రవర్తించడంటూ రూమర్లు ప్రచారమయ్యాయి. ఈ కారణంగానే సంజనా సెట్స్‌కు కూడా రావడం మానేశారని వార్తలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా.. తాజాగా మీటూ ఉధృతమైన నేపథ్యంలో సుశాంత్ కూడా లైంగిక వేధింపులకు పాల్పడే మనిషేనని, అతడి వల్ల సంజనా ఇబ్బంది పడ్డారంటూ పలువురు నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తన నిజాయితీని నిరూపించుకునేందుకు సంజనాతో తాను జరిపిన చాట్ వివరాలను సుశాంత్ బహిర్గతం చేశాడు. వరుస ట్వీట్లతో నెటిజన్లకు సమాధానమిచ్చాడు. ఈ విషయంపై స్పందించిన సంజనా.. ‘యూఎస్ ట్రిప్ నుంచి నిన్ననే తిరిగి వచ్చాను. కీజీ ఔర్ మానీ సెట్లో నేను వేధింపులకు గురయ్యానని వార్తలు వస్తున్నాయి. నిజానికి అలాంటి సంఘటనలేమీ జరగలేదు. అవన్నీ అబద్ధాలే. ఇక వాటికి స్వస్తి పలికితే మంచిది’ అంటూ ట్వీట్ చేశారు. I feel sad to reveal personal information but it seems that there is no other way to state what was, in the midst of this curated and well timed smear campaign. From the first till the last day of the shoot, this is what happened on the Set with Sanjana. (2/2) pic.twitter.com/vTOcbSwada — Sushant Singh Rajput (@itsSSR) October 19, 2018 pic.twitter.com/lQQgtuVmPl — Sanjana Sanghi (@sanjanasanghi96) October 23, 2018 -
కొత్త ప్రయాణం
కొత్త సినిమాను మొదలు పెట్టారు బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్. నాలుగేళ్ల క్రితం వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ సినిమాకు ఇది రీమేక్. ఇంతకముందు దర్శకత్వ శాఖలో పనిచేయడం పాటు, నటుడిగాను సినిమాలు చేసిన ముకేశ్ చబ్రా ఈ సినిమాతో దర్శకునిగా మారారు. ‘రాక్‌స్టార్, హిందీ మీడియం, ఫక్రీ రిటర్స్ ’ సినిమాల్లో కీలక పాత్రలు చేసిన సంజనా సాంఘీ ఈ చిత్రంలో కథానాయిక. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘కొత్త ప్రయాణం మొదలైంది. ముకేశ్ చబ్రా నాకు ఎప్పటి నుంచో తెలుసు. అతనిపై నమ్మకంతో స్క్రిప్ట్ చదవకుండానే సైన్ చేశాను.’’ అని పేర్కొన్నారు సుశాంత్. -
హాలీవుడ్ కథలో... దీపికా పదుకొనే!
హీరో, హీరోయిన్లకు క్యాన్సర్ ఉంటుంది. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. క్లయిమాక్స్‌లో హీరో చనిపోతే...హీరోయిన్ అతని జ్ఞాపకాలతో జీవితం కొనసాగిస్తుంది. హాలీవుడ్లో గత ఏడాది విడుదలై మంచి పేరు తెచ్చుకున్న ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ అనే సినిమా కథ ఇది. ప్రపంచ ప్రఖ్యాత రచయిత జాన్ గ్రీన్ రాసిన నవల ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ ఆధారంగా జోష్ బూన్ దర్శకత్వంలో అదే పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ సినిమా హిందీలో రీమేక్ కానుంది. ఈ చిత్రంలో కథానాయికగా దీపికా పదుకొనే నటించనున్నారని సమాచారం. దీపికతో ‘కాక్టైల్’, ‘ఫైండింగ్ ఫానీ’ చిత్రాలు రూపొందించిన హోమీ అదజానియా దీన్నీ తెరకెక్కించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విషాదభరితమైన ప్రేమకథ కావడంతో హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా స్క్రిప్ట్‌లో మార్పులూ చేర్పులూ చేస్తున్నార ట.