ఆ బాలీవుడ్‌ రీమేక్‌పై నాని కన్ను | Natural Star Nani in Andhadhun Remake | Sakshi
Sakshi News home page

ఆ బాలీవుడ్‌ రీమేక్‌పై నాని కన్ను

Published Sat, Aug 17 2019 10:14 AM | Last Updated on Sat, Aug 17 2019 12:09 PM

Natural Star Nani in Andhadhun Remake - Sakshi

ప్రస్తుతం సౌత్, నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో రీమేక్‌ల ట్రెండ్‌ నడుస్తుంది. ఒక భాషలో ఘనవిజయం సాధించిన సినిమాలను ఇతర భాషల్లోకి రీమేక్‌ చేస్తున్నారు మేకర్స్‌. తాజాగా ఈ లిస్ట్‌లో ఓ బాలీవుడ్ సూపర్‌హిట్ చేరనుంది. ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా హిందీలో ఘనవిజయం సాధించిన సినిమా అంధాధున్‌. ఈ సినిమాలో నటనకు గాను ఆయుష్మాన్‌ జాతీయ అవార్డును కూడా సాధించాడు.

ఈ సినిమాను సౌత్‌లో రీమేక్ చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరగుతున్నాయి. ఇప్పటికే తమిళ వర్షన్‌లో ప్రశాంత్‌ హీరోగా నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు తెలుగు వర్షన్‌ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు నాని ఆసక్తిగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే గ్యాంగ్‌ లీడర్‌ షూటింగ్‌ పూర్తి చేసిన నాని, ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని నెగెటివ్‌ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమా తరువాత అంధాదున్‌ రీమేక్‌ను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement