
సత్యదేవ్
‘బాహుబలి’ వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా, నిర్మాత ప్రవీణా పరుచూరితో కలసి ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యదేవ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా మలయాళ ‘మహేశింటె ప్రతీకారమ్’ చిత్రానికి రీమేక్. అరకు వ్యాలీలో జరిపిన 36 రోజుల షెడ్యూల్‌తో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేశారు. ‘‘ఉమా మహేశ్ చాలా సౌమ్యుడు. ఓ సందర్భంలో అతను ఉగ్రరూపం దాల్చాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటనేది కథ. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2020 ఏప్రిల్ 17న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాతలు.
Comments
Please login to add a commentAdd a comment