నాని మరో రీమేక్‌కు ఓకె చెప్పాడా..! | Nani Wants to Remake 96 Movie under Dil Raju Banner | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 25 2018 2:15 PM | Last Updated on Tue, Sep 25 2018 2:15 PM

Nani Wants to Remake 96 Movie under Dil Raju Banner - Sakshi

వరుస విజయాలతో సూపర్‌ ఫాంలో కనిపించిన యంగ్‌ హీరో నాని ఇటీవల కృష్ణార్జున యుద్ధం సినిమాతో  తడబడ్డాడు. ప్రస్తుతం నాగార్జునతో కలిసి దేవదాస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు తరువాత చేయబోయే సినిమాలను కూడా వరుసగా లైన్‌లో పెట్టేస్తున్నాడు నేచురల్‌ స్టార్‌.

దేవదాస్‌ తరువాత పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న జెర్సీలో నటిస్తున్న నాని ఆ తరువాత చేయబోయే సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. తమిళ్‌లో అక్టోబర్‌ 4న రిలీజ్‌ అవుతున్న ‘96’ సినిమాను తెలుగులో నాని హీరోగా రీమేక్‌గా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.

విజయ్‌ సేతుపలి, త్రిష హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా రీమేక్‌ హక్కులను స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు 96 భారీ మొత్తానికి తీసుకున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గతంలో రీమేక్‌గా తెరకెక్కిన నాని సినమాలు ఆహా కల్యాణం, భీమిలి కబడ్డి జట్టు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement