65 ఏళ్ల తర్వాత రీమేక్‌ అవుతున్న హాలీవుడ్‌ మూవీ | The Ten Commandments Remake To Release On December 31 | Sakshi
Sakshi News home page

ది టెన్‌ కమాండ్‌మెంట్స్‌.. 65 ఏళ్ల తర్వాత రీమేక్‌

Published Fri, Dec 31 2021 10:03 AM | Last Updated on Fri, Dec 31 2021 10:03 AM

The Ten Commandments Remake To Release On December 31 - Sakshi

The Ten Commandments: డౌగ్రే స్కాట్, లినస్‌ రోచ్, నవీన్‌ ఆండ్రూస్, మియా మాస్ట్రో, పాల్‌ రైస్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన తాజా చిత్రం ‘ది టెన్‌ కమాండ్‌మెంట్స్‌’. దర్శక ద్వయం రాబర్ట్‌ డోర్న్‌ హెల్మ్, జెఫ్రీ మడేజా తెరకెక్కించిన చిత్రం ఇది. ఈ సినిమా ఇంగ్లీష్, తెలుగు, తమిళ్‌ తదితర భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా నేడు(డిసెంబర్‌ 31) విడుదలవుతోంది.

కాగా 1956లో దర్శక–నిర్మాత సెసిల్‌ బి డెమిల్లే రూపొందించిన ‘ది టెన్‌ కమాండ్‌మెంట్స్‌’కి ఇది రీమేక్‌. అప్పట్లో దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ చిత్రం 50 వారాలకు పైగా ప్రదర్శితమైంది. 65 ఏళ్ల తర్వాత ఈ చిత్రకథాంశంతో రీమేక్‌ అయిన తాజా ‘ది టెన్‌ కమాండ్‌మెంట్స్‌’ ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రంలో మోసెస్‌గా డౌగ్రే స్కాట్, ఆరోన్‌గా లినస్‌ రోచ్‌ కనిపిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement