Mimi Movie Remake: Keerthy Suresh In Talks For Mimi Remake - Sakshi
Sakshi News home page

Keerthy Suresh: గర్భవతిగా కనిపించనున్న కీర్తి సురేశ్‌!

Published Mon, Aug 30 2021 7:18 AM | Last Updated on Mon, Aug 30 2021 9:27 AM

Keerthy Suresh In Talks For Mimi Remake - Sakshi

Keerthy Suresh: కృతీసనన్‌ లీడ్‌ రోల్‌లో నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘మిమీ’ (2021) తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ కానుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. ‘మిమీ’ సినిమా తెలుగు రీమేక్‌ హక్కుల కోసం ఓ నిర్మాణ సంస్థ చర్చలు జరుపుతోందనే ప్రచారం సాగుతోంది.

అంతేకాదు... కృతీసనన్‌ చేసిన పాత్రను సౌత్‌లో కీర్తి సురేశ్‌ చేయనున్నారని, ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు మొదలయ్యాయని టాక్‌. ఓ విదేశీ జంటకు బిడ్డను ఇవ్వడం కోసం సరోగసీ ద్వారా గర్భం దాల్చిన ఓ పెళ్లి కాని యువతి కథే ‘మిమీ’ చిత్రం. మరి.. ‘మిమీ’ రీమేక్‌కు కీర్తీ సురేశ్‌ పచ్చజెండా ఊపుతారా? వేచి చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement