28 ఏళ్లు వెనక్కి! | Samantha to act in remake of Korean movie 'Miss Granny' | Sakshi
Sakshi News home page

28 ఏళ్లు వెనక్కి!

Published Fri, Nov 30 2018 2:56 AM | Last Updated on Fri, Nov 30 2018 2:56 AM

Samantha to act in remake of Korean movie 'Miss Granny' - Sakshi

సమంత

ఎంత ఖరీదు ఉంటుంది? అగ్రకథానాయిక సమంత చీర కొంటే... వేలల్లో! లక్షల్లో! ఇలా ఊహించడం కష్టం. మరి... స్టార్లు కట్టే చీరలంటే మాటలా? పైగా డిజైనర్‌ శారీస్‌ అంటే ఖరీదు ఎక్కువే. అయితే సమంత ఇప్పుడు చూస్తున్నది డిజైనర్‌ శారీస్‌ కాదట. 1980–90 రోజుల్లో ఉండే చీరలు కట్టుకోవాలనుకున్నారు. దానికోసం ఒకటి రెండు కాదు.. ఏకంగా డజనుకుపైగా చీరలను సెలక్ట్‌ చేయాలనుకుంటున్నారట. ఎందుకు? అంటే ఆమె తర్వాతి చిత్రం ‘మిస్‌. గ్రానీ’ రీమేక్‌ కోసమట. సమంత ప్రధాన పాత్రలో నందినీరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

నాలుగేళ్ల క్రితం వచ్చిన కొరియన్‌ మూవీ ‘మిస్‌.గ్రానీ’ చిత్రానికి ఇది రీమేక్‌. ప్రస్తుతం ఈ సినిమా కాస్ట్యూమ్స్‌ సెలక్షన్స్‌లో సమంత పాల్గొంటున్నారని సమాచారం. పాత్ర పరంగా 1990నాటి చీరలను రెడీ చేస్తున్నారట కాస్ట్యూమ్‌ టీమ్‌. కొరియన్‌ సినిమాలో కథానాయిక యువతిగానే కాదు 70 ఏళ్ల వృద్ధురాలిగానూ కనిపించింది. సో.. సమంత కూడా అలా కనిపిస్తారని ఊహించవచ్చు. జనవరిలో ఈ సినిమా షూటింగ్‌ మొదలుకానుందని సమాచారం. సురేశ్‌బాబు నిర్మించనున్నారు. ప్రస్తుతం భర్త నాగచైతన్యతో కలిసి ‘మజిలీ’అనే సినిమాలో నటిస్తున్నారు సమంత. ‘నిన్ను కోరి’ ఫేమ్‌ శివనిర్వాణ ఈ సినిమాకు దర్శకుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement