కట్టుదిట్టంగా ఎయిర్‌ఫోర్స్ ర్యాలీ
కడప కల్చరల్:
కడప నగరంలోని మున్సిపల్, ఇండోర్ స్టేడియాల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ శనివారం రెండవరోజు కొనసాగింది. జిల్లా యువజన సర్వీసులశాఖ (స్టెప్) ఆధ్వర్యంలో మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ కోసం నిర్వహించిన ఈ ర్యాలీలో దాదాపు రెండు వేల మందికి పైగా అభ్యర్థులు పాల్గొన్నారు. ఉదయం ఇండోర్ స్టేడియంలో వారికి రాత, అర్హత, శారీరక తదితర పరీక్షలను నిర్వహించారు. అనంతరం శారీరక ఆరోగ్య, ధారుడ్య పరీక్షలను కూడా నిర్వహించారు. ఇందులో మెడికల్ అసిస్టెంట్ పోస్టులకు 35 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు అ«ధికారులు తెలిపారు. వీరికి మెదక్‌జిల్లా దుండిగల్‌లో 2017 జనవరిలో తుది విడత మెడికల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు స్టెప్ సీఈఓ మమత తెలిపారు. ఎంపిక కోసం వచ్చిన అభ్యర్థులు వారి బందుమిత్రులతోపాటు స్థానికంగా ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చిన యువతతో ఇండోర్ స్టేడియం పరిసరాలు రద్దీగా కనిపించాయి.