పరుగు పోటీలో కుప్పకూలిన అభ్యర్థి | crpf job applicant dies in running competition | Sakshi

పరుగు పోటీలో కుప్పకూలిన అభ్యర్థి

May 1 2016 4:06 AM | Updated on Apr 3 2019 8:07 PM

పరుగు పోటీలో కుప్పకూలిన అభ్యర్థి - Sakshi

పరుగు పోటీలో కుప్పకూలిన అభ్యర్థి

దేహ దారుఢ్య పరీక్షల నిమిత్తం సీఆర్‌పీఎఫ్ నిర్వహించిన పరుగు పోటీలో పాల్గొన్న ఏఎస్సై అభ్యర్థి గుండెపోటుతో మృతిచెందారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
హైదరాబాద్: దేహ దారుఢ్య పరీక్షల నిమిత్తం సీఆర్‌పీఎఫ్ నిర్వహించిన పరుగు పోటీలో పాల్గొన్న ఏఎస్సై అభ్యర్థి గుండెపోటుతో మృతిచెందారు. ఈ సంఘటన శనివారం బార్కాస్ సీఆర్‌పీఎఫ్ క్యాంపస్‌లో జరిగింది. ఒడిశా రాష్ట్రం రాంపూర్‌కు చెందిన  హిమాన్షు చంద్ర  జానా(29) ఏఎస్సై పోస్టుల భర్తీ కోసం సీఆర్‌పీఎఫ్‌లో నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షల నిమిత్తం నగరానికి వచ్చారు.

చాంద్రాయణగుట్ట బార్కాస్ సీఆర్‌పీఎఫ్ క్యాంపస్‌లో ఉదయం 7 గంటలకు నిర్వహించిన 1,600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. 800 మీటర్లకు చేరుకోగానే ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. ఆయన్ను డీఆర్‌డీవో అపోలో ఆసుపత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement