
డాక్టర్ దగ్గరకు వెళితే.. ఒకట్రెండు పరీక్షలు చేస్తాడు మీకు తెలుసు కదా! వాటికి నడక వేగం కూడా చేరిస్తే మేలంటున్నారు సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఆశ్చర్యంగా ఉందా? మీ నడక వేగం మీ ఆరోగ్యాన్ని, ఆయుష్షును కూడా సూచిస్తుందన్నది వీరి అంచనా. వేగం ఎంత ఎక్కువగా ఉంటే మీ ఆరోగ్యం కూడా అంత బాగుంటదని, గుండె, మెదడు సంబంధిత సమస్యలకు నడక వేగం సూచిక కూడా కావచ్చునని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త క్రిస్టియన్ డెలీ కాన్‌రైట్ వివరిస్తున్నారు.
అలాగని ఈ రోజు నుంచి ఎక్కువ వేగంగా నడవడం కోసం ప్రయత్నించాల్సిన అవసరమేమీ లేదని దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందన్న గ్యారంటీ ఏమీ లేదని కాన్‌రైట్ తెలిపారు. నడక వేగం గణనీయంగా తగ్గిందంటే ఏదో సమస్య ఉన్నట్లు అర్థం చేసుకోవాలని... అంతేకాకుండా నడక లాంటి సాధారణ వ్యాయామం కూడా ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందన్నది దీనివల్ల తెలుస్తుందని అన్నారు. రొమ్ము కేన్సర్ నుంచి బయటపడ్డ వారిపై వ్యాయామం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు ప్రస్తుతం కాన్‌రైట్ ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment