- కానిస్టేబుల్ ఎంపికలో కీలక ఘట్టం ∙
- ప్రారంభమైన దేహధారుఢ్య పరీక్షలు
- 800 మంది అభ్యర్థులకు 509 మంది హాజరు ∙
- ఆధునిక పరికరాలు ఆలస్యంగా రాక
- ఇబ్బంది పడిన అభ్యర్థులు
అభ్యర్థుల వేట మొదలైంది..
Published Tue, Dec 20 2016 11:01 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
కాకినాడ క్రైం :
కాకినాడ పోలీస్ పెరేడ్ మైదానంలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన శారీరక దేహదారుఢ్య పరీక్షలు మంగళవారం జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రోజువారీగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తొలిరోజు పరీక్షలకు 800 మంది హాజరు కావాల్సి ఉండగా, 509 మంది పాల్గొన్నారు. మిగిలిన 291 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్టు జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ వెల్లడించారు. ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌లను జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ స్వయంగా చేపట్టారు. ఉదయం 5.30 గంటల నుంచి ప్రారంభమైన శారీరక దేహదారుఢ్య పరీక్షలు రాత్రి 9 తొమ్మిది గంటల వరకు కొనసాగాయి. ముందుగా అభ్యర్థుల క్వాలిఫికేష¯ŒS పత్రాల పరిశీలన తర్వాత బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేశారు. అనంతరం ఎత్తు, ఛాతీ కొలత, 1600 మీటర్ల పరుగు పరీక్ష పూర్తి చేశారు. అనంతరం అభ్యర్థుల విద్యార్హతలకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం స్కానింగ్ చేసి అప్‌లోడ్ చేశారు. మూడు గంటల విరామం తర్వాత వంద మీటర్లు, లాంగ్‌జంప్ పరీక్షలను నిర్వహించారు.
ఆధునిక పరిజ్ఞానంతో...
అభ్యర్థుల ఎంపిక పరీక్షలను పోలీసులు ఆధునిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్నారు. 1600 మీటర్లు, వంద మీటర్ల పరుగు పందాలలో అభ్యర్థుల బాడీకి ఆధునిక పరిజ్ఙానం కలిగిన సెన్సార్లు(చిప్ అమర్చిన జాకెట్లు) ఏర్పాటు చేశారు. దీంతో అభ్యర్థులు ఎన్ని సెకండ్లలో, ఎన్ని రౌండ్లు వేశారనే విషయాన్ని పారదర్శకంగా సెన్సార్ల ద్వారా వచ్చిన సమాచారం తెలుస్తుంది. ఎత్తు కొలతలను కూడా మెషీన్ల ద్వారా తీశారు.
అభ్యర్థుల ఎత్తు, ఛాతీ కొలిచే పరికరాలు సకాలంలో పోలీస్ పెరేడ్ మైదానంలోకి చేరకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఉదయం పది గంటల తర్వాత ఇవి రావడంతో సుమారు మూడు గంటల పాటు ఈవెంట్స్ ఆలస్యంగా జరిగాయి. దీంతో అభ్యర్థులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. చీకట్లో విద్యుత్తు లైట్ల వెలుతురులో పోటీలు నిర్వహించాల్సి వచ్చింది. సాయంత్రానికి పూర్తికావాల్సిన ఈవెంట్స్ రాత్రి తొమ్మిది గంటల వరకూ కొనసాగడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement