Bus driver arrested
-
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఒక్కసారిగా..
కరీంనగర్: దుబ్బపల్లి గ్రామశివారులో ఆర్టీసీ బస్సు శుక్రవారం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. కరీంనగర్ నుంచి మంథని వైపుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. దుబ్బపల్లి శివారులోకి చేరుకుంది. ఇదే సమయంలో డ్రైవర్ రతన్ గుట్కా వేసుకుంటున్నాడు. పక్కనుంచి లారీ వెళ్తుంగా ఆర్టీసీ డ్రైవర్ స్టీరింగ్ రోడ్డువైపు తిప్పాడు. దీంతో బస్సు అదుపుతప్పి రాజీవ్ రహదారి పక్కన చెట్లపొదల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఆ సమయంలో బస్సులు దాదాపు 40మందికి పైగా ప్రయాణుకులు ఉన్నారు. ఇందులో దేవిక(సెంటినరీకాలనీ), మల్లయ్య(మంథని), శ్రీరాముల స్వామి(కరీంనగర్) తలకు గాయాలు తీవ్రగాయాలు కాగా, మితాగా వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికుడు శ్రీరాముల స్వామి ఫిర్యాదు మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్ వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికురాలి మృతి
హిమాయత్‌నగర్: ప్రైవేట్ కాలేజీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. రోడ్డుపై పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికురాలిని వేగంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్ను మూసింది. నారాయణగూడ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా, కళ్లెం గ్రామానికి చెందిన సునీత(42) జీహెచ్ఎంసీ సర్కిల్–15లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. ఆమెకు భర్త గోవర్దన్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త గోవర్దన్ గ్రామంలోనే వ్యవసాయం చేస్తుండగా సునీత సీతాఫల్‌మండీలో పిల్లలతో కలిసి ఉంటోంది. సోమవారం ఉదయం డ్యూటీకి వచ్చిన ఆమె బయోమెట్రిక్ అనంతరం రోడ్డు ఊడ్చే పనిలో నిమగ్నమైంది. ఇదే సమయంలో మొయినాబాద్‌కు చెందిన ‘ఆయాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’కు చెందిన బస్సు విద్యార్థులను తీసుకుని రాంకోఠి నుంచి కింగ్‌కోఠి వైపు వెళుతుంది. నాంపల్లి, బజార్‌ఘాట్‌కు చెందిన డ్రైవర్ మహ్మద్ మోమిన్ అతి వేగంగా బస్సు నడుపుతూ పిస్తాహౌజ్ సమీపంలో రోడ్డు శుభ్రం చేస్తున్న సునీతను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆమె తలకు, చేయి, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. తోటి కార్మికులు ఆమెను 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. నారాయణగూడ పోలీసులు డ్రైవర్ మహ్మద్ మోమిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేయర్ దిగ్భ్రాంతి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సునీత మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సునీత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామ ని హామీ ఇవ్వడంతో పాటు ప్రభుత్వం నిర్ధేశించిన ఆర్థిక సాయాన్ని తక్షణం అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరో పక్క యూనియన్ నాయకులు పోలీసుస్టేషన్‌కు చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులకు ఆర్థికపరమైన చేయూత అందించాలంటూ ఇనిస్టిట్యూట్ యాజమాన్యాన్ని కోరారు. విద్యార్థులకు గాయాలు అతి వేగంగా వచ్చిన బస్సు సునీతను ఢీకొట్టిన అనంతరం చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న విద్యార్థులు ముందు సీట్లకు గుద్దుకోవడంతో గాయాలపాలయ్యారు. తన వల్ల ఓ నిండుప్రాణం బలైన విషయాన్ని కూ డా డ్రైవర్ మహ్మద్ మోమిన్ గుర్తించకపోగా ‘క్యాహువా’ అంటూ సంబోధించడాన్ని చూసిన తోటి పారిశుద్ధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. సునీత తల్లి కొన్నేళ్ల క్రితం మృతి చెంద డంతో ఆమె ఉద్యోగాన్ని సునీత చేస్తున్నట్లు తెలిసింది. అతి వేగం ఇద్దరు మహిళల ప్రాణాలు తీసింది. నారాయణగూడ ప్రాంతంలో ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు ఢీకొని జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందగా, బేగంపేటలో కారు ఢీ కొని ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం చెందింది. వివరాలిలా ఉన్నాయి.. -
తెలుగు మహిళ పై అకృత్యం
టీనగర్: కోయంబేడు బస్టాండులో ఒంటరిగా నిలుచునే మహిళలను కిడ్నాప్ చేసి వారితో రాసలీలలు సాగించే ఎంటీసీ బస్‌డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై, విరుగంబాక్కం పిళ్లయార్కోవిల్ వీధికి చెందినముత్తుకుమార్ (25) కోయంబేడు మార్కెట్లో కూలీ. ఇతను ఆంధ్రాకు చెందిన జ్యోతి (23)ని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఐదు నెలల కుమార్తె ఉంది. శనివారం దంపతులు గొడవ పడ్డారు. దీంతో జ్యోతి బిడ్డతోపాటు ఆంధ్రాకు వెళ్లేందుకు కోయంబేడు బస్టాండు చేరుకుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి జ్యోతితో తాను ఎంటీసీ డ్రైవర్‌నని, ఏమి సమస్యంటూ? ఓదార్చారు. ఆ తర్వాత బిడ్డతోపాటు జ్యోతిని బస్సులో తిరువేర్కాడు తీసుకెళ్లాడు. అక్కడ ఒక లాడ్జిలో గది తీసుకున్నారు. అక్కడ ఇద్దరు మద్యం తాగారు. మద్యం మత్తులో జ్యోతి నిద్రలోకి జారుకుంది. ఆ సమయంలో బిడ్డను తీసుకుని సదరు వ్యక్తి పరారయ్యాడు. హఠాత్తుగా నిద్రలేచిన జ్యోతి బిడ్డ, ఆ వ్యక్తి కనిపించకపోవడంతో దిగ్భ్రాంతి చెందింది. దీనిగురించి ఆమె లాడ్జిలో వాకబు చేసింది. దీంతో సమస్య ఏర్పడుతుందనే భయంతో లాడ్జి ఉద్యోగులు, వెంటనే ఆ మహిళను లాడ్జి నుంచి పంపివేశారు. దీనిగురించి జ్యోతి తిరువేర్కాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి లాడ్జిలో విచారణ జరిపారు. బిడ్డను అపహరించిన వ్యక్తి నీతిమణి (45), చెన్నై, తిరునిండ్రవూరుకు చెందిన వ్యక్తి అని తెలిసింది. ఆ చిరునామాకు వెళ్లి పోలీసులు విచారణ జరపగా అది నకిలీదిగా తేలింది. ఇలావుండగా గూడువాంజేరి రైల్వే స్టేషన్లో 40 ఏళ్ల వయసుగల ఒక వ్యక్తి మద్యం మత్తులో బిడ్డతోపాటు కనిపించాడు. దీంతో అతన్ని అనుమానించిన రైల్వే పోలీసులు అతన్ని,బిడ్డను గూడువాంజేరి పోలీసు స్టేషన్లో అప్పగించారు. పోలీసుల విచారణలో పట్టుబడిన వ్యక్తి మురుగానందం (40), చెన్నై ఎంటీసీ బస్సులో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. క్రమశిక్షణా రాహిత్యం కారణంగా అతన్ని అధికారులు సస్పెండ్ చేశారు. సహ డ్రైవర్‌ను చూసేందుకు కోయంబేడుకు రాగా జ్యోతిని మోసగించి తిరువేర్కాడుకు తీసుకువచ్చినట్లు తెలిసింది. దీంతో అతన్ని తిరువేర్కాడు పోలీసులకు అప్పగించారు. అతని వద్ద తీవ్ర విచారణ జరపగా కోయంబేడు బస్టాండులో ఒంటరిగా అవస్థలు పడే మహిళలను గుర్తించి లాడ్జికి తీసుకువెళతానని తెలిపాడు. చెంగల్పట్టులో ఉన్న బంధువుకు బిడ్డను అప్పగించేందుకు తీసుకువెళుతుండగా పోలీసులకు పట్టుబడ్డానని తెలిపాడు. జ్యోతిని, ఆమె బిడ్డను చెంగల్పట్టు మహిళా సంరక్షణాలయంలో ఉంచారు. పోలీసులు మురుగానందంను అరెస్టు చేసి కోర్టు ఉత్తర్వుల మేరకు పుళల్ జైలులో నిర్బంధించారు.