గోతిలో దిగబడిన ఆర్టీసీ బస్సు
హైదరాబాద్: అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణాల కోసం తవ్విన గోతిలో ఆర్టీసీ బస్సు ఇరుక్కుపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. దీంతో మిట్టమధ్యాహ్నం వాహనదారులు ఎర్రటి ఎండలో నరకాన్ని చూశారు. సోమాజిగూడ ఆర్టీఏ కార్యా లయం వద్ద నుంచి సివిల్ సప్లయ్ భవన్ వరకు అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
శుక్రవారం ప్రణవ బిల్డింగ్ వద్ద మంచినీటి పైప్లైన్ పగిలిపోవడంతో నీరు లీకేజీ అయింది. ఈ నీరు కాస్తా కేబుళ్ల కోసం తవ్విన గోతుల్లోకి చేరాయి. దీంతో ఈ మార్గంలో వెళుతున్న ఆర్టీసీ బస్సు అందులో దిగబడింది. దీంతో ఎర్రమంజిల్ నుంచి పంజగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్నగర్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సహాయంతో బస్సును అక్కడి నుంచి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment