
పరకాల: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయం కల్పించడం ఏమో కానీ ఓ విద్యార్థికి మహిళా కండక్టర్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. నడికూడ మండలం నర్సక్కపల్లెకు చెందిన విద్యార్థిని మేఘన పరకాల నుంచి హుజురాబాద్ వెళ్లే బస్సెక్కింది. అయితే ఉచిత ప్రయాణం కావడంతో విద్యార్థిని తన వద్ద ఉన్న ఆధార్ కార్డు చూపించింది.. దీంతో మహిళ కండక్టర్ ఫొటో మార్చుకుంటే ఏమవుతుంది.. చిన్నప్పటి కార్డు ఉందా అంటూ వెటకారంగా మాట్లాడింది.
కాగా తాను అప్‌డేట్ చేసుకున్నానని చెప్పిన పట్టించుకోలేదని.. అలా మాట్లాడకండి అవసరమైతే డబ్బులు తీసుకొమ్మని చెప్పింది. పైసలు ఎక్కువైనాయా.. అయిన కాలేజీ అమ్మాయిలకు పనిపాట లేకుండా బస్సులో తిరగడం ఫ్యాషనైందనడంతో బస్సులోనే ఆ విద్యార్థి కంటతడి పెట్టుకుంది. ఈ విషయాన్ని తన తండ్రికి ఫోన్‌లో తెలియజేయగా అతను పరకాల ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు డిపోకు చేరుకున్నాడు.
డీఎం కొత్త బస్సుల ప్రారంభోత్సవం బిజీగా ఉండటంతో అక్కడే ఉన్న కొందరు ఆర్టీసీ ఉద్యోగులు మరోసారి అలా జరగకుండా చూసుకుంటామంటూ నచ్చజెప్పారు. అయితే ఓ వైపు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కొత్త బస్సులు ప్రారంభిస్తుండగా ఈ సంఘటన జరగడం విశేషం. ఈ విషయంపై ఆర్టీసీ డీఎం రవిచంద్ర దృష్టికి సాక్షి తీసుకెళ్లగా ఆధార్ అప్‌డేట్ చేసుకొమ్మని చెప్పడంలో తప్పులేదన్నారు. బాలిక ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment