
జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. భీమడోలు మండలం పూళ్ల వద్ద అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆగిఉన్న రెండు ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది.
సాక్షి, ఏలూరు: జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. భీమడోలు మండలం పూళ్ల వద్ద అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆగిఉన్న రెండు ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.
మరో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: సినిమాను మించిన లవ్‌స్టోరీ.. విజయవాడ నుంచి పారిపోయి..