నేను డ్రైవరన్నను..! | - | Sakshi
Sakshi News home page

నేను డ్రైవరన్నను..!

Published Tue, Nov 19 2024 12:24 AM | Last Updated on Tue, Nov 19 2024 9:28 AM

-

చిన్నారిని లాలించిన ఆర్టీసీ డ్రైవర్‌ మల్లయ్య

ఖమ్మంమయూరిసెంటర్‌: మహాలక్ష్మి పథకం అమలుతో పలు సమయాల్లో రద్దీ దృష్ట్యా ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు కొందరు నిర్దేశిత ప్రాంతాల్లో ఆపడం లేదని, నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని అక్కడకక్కడా ఫిర్యాదులు వస్తున్నాయి. కానీ ఈ డ్రైవర్‌ మాత్రం అత్యవసర పరిస్థితుల్లో మహిళా ప్రయాణికురాలి బిడ్డను లాలించి అభిమానం చూరగొన్నాడు. 

అంతేకాక అధికారుల నుంచి సన్మానం అందుకున్నాడు. వివరాలు.. ఇటీవల మణుగూరు నుండి హైదరాబాద్‌కు చంటి బిడ్డతో ఓ మహిళ బస్సులో వెళ్తోంది. ఆమె మార్గ మధ్యలోని ఓ బస్టాండ్‌లో వ్యక్తిగత అవసరాలపై దిగాల్సి రాగా వెంట ఎవరూ లేకపోవడంతో బిడ్డను ఎవరికి అప్పగించాలో తెలియక సందిగ్ధత ఎదుర్కొంది.

 చివరకు బస్సు డ్రైవర్‌ పి.మల్లయ్యను ఆశ్రయించగా ఆయన చంటి బిడ్డను ఎత్తుకుని ఆమె వెళ్లి వచ్చే వరకు లాలించాడు. ఈ విషయం తెలియడంతో ఆర్టీసీ ఆర్‌ఎం ఏ.సరిరామ్‌ సోమవారం మల్ల య్యను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌లు భవాని ప్రసాద్‌, జీఎన్‌ పవిత్ర, పర్సనల్‌ ఆఫీసర్‌ ఎ.నారాయణ పాల్గొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement