
హైదరాబాద్: బైక్ అదుపు తప్పి ఆర్టీసీ బస్సు వెనక చక్రాల కింద పడి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శోభన్ బాబు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ, ఆటోనగర్‌కు చెందిన ఆకుల సాయికృష్ణ(26) గచ్చిబౌలి జనార్దన్‌హిల్స్‌లోని సునీతా రెడ్డి లగ్జరీ మెన్స్ హాస్టల్‌లో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.
సోమవారం ఉదయం అతను బైక్‌పై డీఎల్‌ఎఫ్ వైపు వెళుతుండగా, రాయదుర్గం నుంచి డీఎల్‌ఎఫ్ వైపు వస్తున్న హెచ్‌సీయూ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేసే క్రమంలో బైక్ అదుపు తప్పి కిందçపడ్డాడు. బస్సు వెనుక చక్రాలు అతడి తలమీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment