
హైదరాబాద్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన నిన్న సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో జరిగింది. కొండాపూర్ చౌరస్తా సమీపంలో బస్సు కదులుతున్న సమయంలో రోడ్డు పక్క నుంచి వచ్చిన వెస్ట్ బెంగాల్‌కు చెందిన బిసు రాజాబ్ (40) బస్సు వెనుక టైర్ కింద తల పెట్టాడు. అది గమనించిన స్థానికులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నం చేశారు.
బస్సు టైర్ కింద పడ్డ అతన్ని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయితే హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ నిన్న రాత్రి బిసు రాజాబ్ మృతి చెందాడు. దీంతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment