గౌరిబిదనూరు: బస్సు లో ప్రయాణించాలనుకునే వారు టికెట్ కొనక తప్పదు. మరి కోళ్లు కూడా టికెట్ తీసుకోవాలా? అంటే అవుననే కర్ణాటక అధికారులు సమాధానం ఇస్తున్నారు. ఆదివారం బెంగళూరు సమీపంలో గౌరిబిదనూరు తాలూకా ముదలోడు గ్రామానికి చెందిన శ్రీనివాస్ తన రెండు కోళ్లను తీసుకుని కర్ణాటక ఆర్టీసీ బస్సెక్కాడు. బస్‌కండక్టర్ అతనికి రూ.24 టికెట్, రెండు కోళ్లకు రెండు హాఫ్ టికెట్లు ఇచ్చాడు. ఆ టికెట్లపై పిల్లలకు అని రాసి ఇచ్చాడు. కానీ ప్రయాణికుడు.. పిల్లలకని ఎందుకు, కోళ్లకు అనే రాసివ్వు అని కండక్టర్‌తో వాగ్వాదానికి దిగాడు. కోళ్లు, గువ్వలు, చిలుకలకు అర టికెట్ ఇవ్వాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు కూడా స్పష్టం చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment