
కాళ్లు తెగి రోడ్డుమీద విలవిలలాడుతున్న యువకులు
నెలమంగల (దొడ్డబళ్లాపురం): రోడ్డు ప్రమాదంలో కాళ్లు తెగిపడి ఇద్దరు యువకులు నడిరోడ్డు మీదే నరకయాతన పడిన సంఘటన నెలమంగల సమీపంలోని మాదావర వద్ద చోటుచేసుకుంది. వసంత్ (28), రాహుల్ (24) మాదావర వద్ద బైక్‌పై వెళ్తుండగా వెనుకగా వచ్చిన క్యాంటర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో క్యాంటర్ చక్రాల కింద చిక్కుకున్న ఇద్దరి కాళ్లూ దాదాపు తెగిపోయాయి. జాతీయ రహదారి కావడంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న కారణంగా అంబులెన్స్ రావడం ఆలస్యమైంది. దీంతో స్థానికులు ఇద్దరినీ నవయుగ టోల్‌కు చెంందిన వాహనంలోనే ఆస్పత్రికి తరలించారు. నెలమంగల ట్రాఫిక్ పోలీసులు క్యాంటర్ డ్రైవర్‌ను వాహనంతో సహా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment