1600 ఉద్యోగాలకు కోత
పర్సనల్ కంప్యూటర్ల డిమాండ్ పడిపోవడం హార్డ్ డిస్క్ డ్రైవ్ తయారీ కంపెనీలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. అమెరికాకు చెందిన డేటా స్టోరేజ్ కంపెనీ సీగేట్ టెక్నాలజీ 1600 ఉద్యోగాలకు కోత విధించనున్నట్టు తెలుస్తోంది. లేదా 3శాతం వర్క్ ఫోర్స్ ను తగ్గించుకోనుంది. పునర్ నిర్మాణ ప్రణాళికలో భాగంగా తన కాస్ట్ ను తగ్గించే నేపథ్యంలో సీగేట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సెప్టెంబర్ త్రైమాసికం ముగిసే లోపల తన ప్లాన్ ను పూర్తిచేసేందుకు సీగేట్ సిద్ధమైంది. 620 లక్షల డాలర్ల ముందస్తు పన్ను చార్జీలపై ఈ పునర్ నిర్మాణ ఫలితం ప్రభావం చూపించనున్నట్టు సీగేట్ పేర్కొంది.
ఈ పునర్ నిర్మాణ ఫలితాలు తన కాస్ట్ ను తగ్గించుకోవడంతో పాటు వార్షిక రన్ రేట్ బేసిస్ లో 1000లక్షల డాలర్ల వరకూ పొదుపుకు సహకరిస్తాయని కంపెనీ వెల్లడించింది. సీగేట్ కంపెనీ ప్రపంచమంతటా 52 వేల ఉద్యోగులను కల్గి ఉంది. సెప్టెంబర్ వరకు 1,050 ఉద్యోగాలకు కోత విధించనుంది. వర్జినల్ ఈక్విప్ మెంట్ తయారీదారులకు, పర్సనల్ కంప్యూటర్ తయారీదారులకు డిమాండ్ క్షీణించడంతో, గత ఐదేళ్లగా సీగేట్ రెవెన్యూలు పడిపోతూ నష్టాలను నమోదుచేస్తున్నాయి. ఈ ఏడాది దాదాపు 35 శాతం వరకు కంపెనీ స్టాక్స్ పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో సీగేట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.