10 శాతం ఉద్యోగులపై ఆ బ్యాంకు వేటు!
10 శాతం ఉద్యోగులపై ఆ బ్యాంకు వేటు!
Published Mon, Nov 28 2016 5:08 PM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM
బ్రిటీష్ బహుళ జాతీయ బ్యాంకు, ఆర్థిక సేవల సంస్థ స్టాండర్డ్ చార్టడ్ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోబోతుందట.. తన గ్లోబల్ కార్పొరేట్, ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులపై వేటు వేయాలని బ్యాంకు నిర్ఘయించినట్టు సంబంధిత వర్గాలు సోమవారం పేర్కొన్నాయి. వ్యయాలను తగ్గించుకోవడానికి బ్యాంకు ప్రయత్నాలు ప్రారంభించిందని, ఈ నేపథ్యంలో ఉద్యోగులపై కోత విధించినున్నట్టు తెలిపాయి. ఈ ఉద్యోగాల కోత ప్రక్రియ ఈ వారం మొదటి నుంచే సింగపూర్, హాంగ్కాంగ్ వంటి అన్ని మేజర్ బ్యాంకింగ్ సెంటర్లలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అయితే తమ కార్పొరేట్, ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ డివిజన్ను మరింత సమర్థవంతంగా తయారుచేస్తామని స్టాండర్డ్ చార్టడ్ అధికార ప్రతినిధి చెప్పారు.
వృథాగా ఉన్న ఉద్యోగాలను తీసివేసి, టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టనున్నట్టు చెప్పారు. ఈ చర్యలతో బ్యాంకు వ్యయాలను తగ్గించుకోనున్నట్టు తెలిపారు. కొన్ని ఉద్యోగాలపైనే ఈ ప్రభావం పడుతుందని ప్రకటించిన ఆయన ఎంతమంది ఉద్యోగులను తొలగించనున్నారో తెలుపలేదు. ఈ బ్యాంకులో జూన్ ముగింపుకు మొత్తం 84,477 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగ, ఈ బ్యాంకు అంచనావేసిన దానికంటే తక్కువగా మూడో త్రైమాసిక ఫలితాలను నమోదుచేసింది. బ్యాంకు రాబడి, లాభాలు ఆశించదగ్గ స్థాయిలో లేవని ప్రకటించిన ఆ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిల్ వింటర్స్, సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఉద్ఘాటించారు.
Advertisement
Advertisement