standard chartered
-
కార్పొరేట్ వలంటీర్లు.. సేవా కార్యక్రమాలు
సమాజం నుంచి తీసుకోవడమే కాదు.. ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలనే స్ఫూర్తితో పలు కార్పొరేట్ కంపెనీలు(Corporate Cos) సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ తదితర రంగాల్లో ప్రజలకు సాయమందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వాటిలో వలంటీర్లు(Corporate volunteering)గా పాలుపంచుకునేలా ఉద్యోగులను కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం, పెయిడ్ లీవ్ ఇవ్వడమే కాకుండా తగు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. దీంతో ఉద్యోగులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరింత సమయం సైతం వెచ్చించేందుకు ముందుకు వస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్న వాటిల్లో ఇన్ఫోసిస్, పీఅండ్‌జీ, క్యాప్‌జెమిని(Cap Gemini), స్టాండర్డ్ చార్టర్డ్, హెచ్‌యూఎల్, నెట్‌యాప్ తదితర కంపెనీలు ఉన్నాయి.వివిధ కంపెనీలు నిర్వహిస్తున్న ప్రాజెక్టుల్లో కొన్ని..ఇన్ఫోసిస్జీవవైవిధ్యానికి తోడ్పడేలా ప్రాంతీయంగా వృక్ష సంపదను పెంపొందించేందుకు కంపెనీ నడుం కట్టింది. ఉద్యోగులంతా కలిసి ఇటీవలే 2,00,000కు పైగా సీడ్‌బాల్స్‌ను తయారు చేశారు. వీటిని దేశవ్యాప్తంగా దాదాపు 20 ప్రాంతాల్లో అడవుల పెంపకం ప్రాజెక్టుల్లో ఉపయోగించనున్నారు. ఇక ఇన్ఫీ(Infosys)కి చెందిన బీపీఎం విభాగం ప్రాజెక్ట్ జెనిసిస్ పేరిట మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలను అందిపుచ్చుకునేందుకు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ కల్పిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇలా 78,000 మందికి పైగా విద్యార్థులకు తోడ్పాటు అందించింది. పీఅండ్జీఅంతగా విద్యా సేవలు అందని ప్రాంతాల్లోని బాలలకు చదువును అందుబాటులోకి తెచ్చే దిశగా శిక్షా ప్రోగ్రాంను నిర్వహిస్తోంది. దీనితో దాదాపు యాభై లక్షల మందికి పైగా చిన్నారులు లబ్ధి పొందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.క్యాప్జెమినివిద్య, సస్టైనబిలిటీ, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాల అభివృద్ధి మొదలైన కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. వీటిలో 90,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. మొత్తం 2,43,000 పైగా గంటల సమయం వెచ్చించారు. గత కొన్నాళ్లుగా ఉద్యోగులు స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాల కోసం వెచ్చించే సమయం వార్షికంగా 20 శాతం మేర పెరుగుతోందని సంస్థ వర్గాలు తెలిపాయి. ఉద్యోగులు మాక్ ఇంటర్వ్యూలు .. రెజ్యూమె బిల్డింగ్ వర్క్‌షాప్‌లు నిర్వహించడం, కెరియర్ విషయంలో మార్గనిర్దేశనం చేయడం మొదలైన మార్గాల్లో ఉద్యోగార్థులకు సహాయం చేస్తున్నారు. జాబ్ మార్కెట్‌కి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకుని, అవకాశాలను అందిపుచ్చుకునేలా వారికి తోడ్పాటు అందిస్తున్నారు.ఇదీ చదవండి: విల్మర్ నుంచి అదానీ ఔట్స్టాండర్డ్ చార్టర్డ్నైపుణ్యాలను బట్టి వివిధ సామాజిక సేవా ప్రాజెక్టుల్లో పాలుపంచుకునేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తోంది. విద్యార్థులకు మార్గనిర్దేశనం చేయడం, కెరియర్‌పరంగా గైడెన్స్ ఇవ్వడం వంటి కార్యక్రమాలను చేపడుతోంది. వాటిలో పాల్గొనే ఉద్యోగులకు మూడు రోజుల పాటు పెయిడ్ లీవ్ కూడా ఇస్తోంది. ఇలాంటి కార్యక్రమాలపై ఉద్యోగులంతా కలిసి మొత్తం 1,17,376 గంటల సమయాన్ని వెచ్చించారు. -
ఇన్వెస్ట్మెంట్.. మనోళ్లకు మహా ఇష్టం!
ఆసియాలో పెట్టుబడుల విషయంలో అధిక చైతన్యం కలిగింది భారత దేశమేనని ‘స్టాండర్డ్ చార్టర్డ్’ సంస్థ నిర్వహించిన అధ్యయనం తేల్చింది. ఎమర్జింగ్ అఫ్లూయంట్ స్డడీ 2018’ పేరుతో ఈ సంస్థ ఆసియా, ఆఫ్రికా, మిడిల్ఈస్ట్ ప్రాంతాల్లో సంపన్న వినియోగదారులు 11,000 మంది అభిప్రాయాలను సేకరించింది. పొదుపు చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు తగినంత ఆదాయం కలిగి సంపన్న వినియోగదారులుగా అవతరిస్తున్న వారి అభిప్రాయాలను తెలుసుకుంది. మనదేశంలో ఎక్కువ మంది సంపన్న కస్టమర్లు నమ్మే విషయం... సంపద నిర్వహణ సమర్థంగా నిర్వహించడం అన్నది గొప్ప సామాజిక చైతన్యానికి ప్రతీక అని. అధ్యయనంలో వెల్లడైన అంశాలివీ... ♦ మన దేశంలో సంపన్న వినియోగ వర్గాల్లో మూడింట రెండొంతుల (68 శాతం) మంది ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇన్వెస్ట్మెంట్ సాధనాలను అనుసరిస్తున్నారు. ఈ సర్వేలో ఇదే గరిష్ట స్కోరు. ♦ 31 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకుంటుంటే, 25 శాతం మంది ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలను, 22 శాతం ఈక్విటీలను ఎంచుకుంటున్నారు. కానీ, భారత్ వెలుపల సర్వే జరిగిన ఇతర మార్కెట్లలో ఈ సాధనాలను ఎంచుకునే వారు 16 శాతం, 19 శాతం, 18 శాతంగానే ఉన్నారు. ♦ 44 శాతం మంది కెరీర్లో పురోగతి, వేతనంలో వృద్ధిని కోరుకుంటున్నారు. మరో 25 శాతం మంది అయితే వ్యాపారం ఆరంభించాలని, సంపద వృద్ధికి ఇదే చక్కని మార్గమని భావిస్తున్నారు. ♦ ఇక మనదేశంలో సంపన్న వినియోగ వర్గంగా అవతరించే వారిలో 79 శాతం మంది సమర్థవంతమైన సంపద నిర్వహణ సామాజిక చైతన్యానికి కీలకమని భావిస్తుండడం గమనార్హం. ♦ అధిక సామాజిక చైతన్యం కలిగిన మార్కెట్‌గా భారత్ నిలిచింది. చైనా, భారత్ దేశాల్లో మూడింట రెండొంతులు (67%) మంది సామాజిక చైతన్యం పెరుగుదలను అనుభవిస్తున్నారు. ♦ తమ పిల్లల చదువుల కోసం పొదపు చేయడం వీరి కీలక లక్ష్యంగా ఉంది. మన దేశంలో 17 శాతం మంది దీన్నే తెలియజేశారు. అంతేకాదు ఇతర మార్కెట్లలోనూ ఇదే అగ్ర ప్రాధాన్యమని 16 శాతం మేర చెప్పడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ♦ మన దేశంలో ఎక్కువ మందికి ఇన్వెస్ట్ చేయాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ... తక్కువ ఆర్థిక పరిజ్ఞానం, అందుబాటులో ఉన్న అన్ని సాధనాల గురించి తెలియకపోవడంతో వెనుకడుగు వేస్తున్నట్టు స్టాండర్డ్ చార్డర్ట్ బ్యాంకు, రిటైల్ బ్యాంకింగ్ భారత విభాగం హెడ్ శ్యామల్ సక్సేనా తెలిపారు. డిజిటల్ ఉపకరణాలు వారి లక్ష్య సాధనకు ఉపకరిస్తాయని చెప్పారు. సామాజిక చైనత్యం మన దేశంలో సామాజిక చైనత్యం ఫరిడవిల్లుతోంది. ఆదాయాల్లో చక్కని వృద్ధి ఇందుకు తోడ్పడుతోంది. 46% మందికి గత ఏడాదిలో 10% వేతనం పెరగ్గా, 30 శాతం మందికి గత ఐదేళ్ల కాలంలో 50 శాతం అంతకంటే ఎక్కువే వేతనం వృద్ధి చెందింది. 78% మంది డిజిటల్ ఉపకరణాలను వినియోగిస్తున్నారు. వారి విజయానికి ఇవే కీలకమని భావిస్తున్నారు. 80 శాతం మంది ఆన్లైన్ బ్యాంకింగ్‌కు ఓటేయగా, డిజిటల్ నగదు నిర్వహణ అన్నది ఆర్థిక లక్ష్యాల సాధనకు తమను దగ్గర చేశాయని తెలిపారు. -
10 శాతం ఉద్యోగులపై ఆ బ్యాంకు వేటు!
బ్రిటీష్ బహుళ జాతీయ బ్యాంకు, ఆర్థిక సేవల సంస్థ స్టాండర్డ్ చార్టడ్ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోబోతుందట.. తన గ్లోబల్ కార్పొరేట్, ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులపై వేటు వేయాలని బ్యాంకు నిర్ఘయించినట్టు సంబంధిత వర్గాలు సోమవారం పేర్కొన్నాయి. వ్యయాలను తగ్గించుకోవడానికి బ్యాంకు ప్రయత్నాలు ప్రారంభించిందని, ఈ నేపథ్యంలో ఉద్యోగులపై కోత విధించినున్నట్టు తెలిపాయి. ఈ ఉద్యోగాల కోత ప్రక్రియ ఈ వారం మొదటి నుంచే సింగపూర్, హాంగ్‌కాంగ్ వంటి అన్ని మేజర్ బ్యాంకింగ్ సెంటర్లలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అయితే తమ కార్పొరేట్, ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ డివిజన్‌ను మరింత సమర్థవంతంగా తయారుచేస్తామని స్టాండర్డ్ చార్టడ్ అధికార ప్రతినిధి చెప్పారు. వృథాగా ఉన్న ఉద్యోగాలను తీసివేసి, టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టనున్నట్టు చెప్పారు. ఈ చర్యలతో బ్యాంకు వ్యయాలను తగ్గించుకోనున్నట్టు తెలిపారు. కొన్ని ఉద్యోగాలపైనే ఈ ప్రభావం పడుతుందని ప్రకటించిన ఆయన ఎంతమంది ఉద్యోగులను తొలగించనున్నారో తెలుపలేదు. ఈ బ్యాంకులో జూన్ ముగింపుకు మొత్తం 84,477 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగ, ఈ బ్యాంకు అంచనావేసిన దానికంటే తక్కువగా మూడో త్రైమాసిక ఫలితాలను నమోదుచేసింది. బ్యాంకు రాబడి, లాభాలు ఆశించదగ్గ స్థాయిలో లేవని ప్రకటించిన ఆ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిల్ వింటర్స్, సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఉద్ఘాటించారు. -
ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతాయ్...
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గురువారం రెండు ప్రముఖ సంస్థలు- ఐక్యరాజ్యసమితి, ఇండియా రేటింగ్స్ వెలువరించిన అంచనాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4.8 శాతం వద్ద కట్టడి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం కష్టం కావచ్చని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి పేర్కొంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంకన్నా, చేసే వ్యయం అధికంగా ఉండే పరిస్థితిని ద్రవ్యలోటుగా వ్యవహరిస్తారు. తక్కువ వృద్ధిరేటు, సబ్సిడీల భారం తీవ్రంగా ఉండడం, పన్నుల ఆదాయం తగ్గే అవకాశాలు వంటి అంశాలు తమ అంచనాలకు కారణమని ఐక్యరాజ్యసమితిని నివేదిక పేర్కొంది. ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2014’ పేరుతో రూపొందించిన నివేదికలో సమితి ఈ వ్యాఖ్యలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 4.9 శాతం. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 4.8 శాతంగా ఉంటుందని, 2014-15లో ఇది 5.3 శాతానికి పెరగవచ్చని కూడా తెలిపింది. రూపాయి విలువ తగ్గడం వల్ల ఎగుమతులు రానున్న నెలల్లో పెరగవచ్చని వివరించింది. ఇండియా రేటింగ్స్ ఇలా..: కాగా 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత మౌలిక రంగం ఔట్‌లుక్‌ను ‘ప్రతికూలత’ గ్రేడింగ్‌లో ఉంచుతున్నట్లు ఫిచ్ గ్రూప్ కంపెనీ ఇండియా రేటింగ్స్ గురువారం పేర్కొంది. పలు కంపెనీల ప్రాజెక్టులకు బలహీన రుణ పరిస్థితులు దీనికి కారణమని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.