సాక్షి,ముంబై: కేంద్ర ఆర్థికమంత్రినిర్మలా సీతారామన్ ప్రకటించిన కార్పొరేట్ పన్ను కోత స్టాక్‌మార్కెట్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను భారీగా ప్రభావితం చేసింది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు లాభాలను నమోదు చేసేంత. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కీలక సూచీలు రెండూ వారంతాంలో ప్రధాన మద్దతుస్థాయిలకు ఎగిసి స్థిరంగా ముగిసాయి. బెంచ్ మార్క్ సూచీలు శుక్రవారం 6 శాతానికి పైగా పెరిగాయి. సెన్సెక్స్ 38,350 మార్కుకు చేరగా, నిఫ్టీ 11,370 స్థాయిని టచ్ చేసింది. కేవలం ఐటీ, జీ ఎంటర్‌టైన్ మెంట్ తప్ప అన్నీ లాభాల్లోనే ముగిసాయి.
ప్రధానంగా ఆటో కంపెనీలకు ఆర్థికమంత్రి ప్రకటన ఊరట నిచ్చింది. ఐషర్ మోటార్స్, మారుతి సుజుకి, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ టాప్‌బ విన్నర్స్‌గా ఉన్నాయి. 'ఎ కేటగిరీ' గ్రూపులోని 10 శాతానికిపైగా ఎగిసిన వాటిల్లో షేర్లలో ఐషర్ మోటార్స్ (16 శాతం), హీరో మోటో కార్ప్ 13 శాతం , జామ్నా ఆటో (11శాతం), అశోక్ లేలాండ్ (11 శాతం), మారుతి సుజుకి (11 శాతం) ఉన్నాయి. మారుతి సుజుకి షేర్ ధర అంతకుముందు రూ .5,938.30 తో పోలిస్తే 11శాతం పెరిగి రూ .6,626 కు చేరుకుంది. ఈ స్టాక్ 6,001 నుంచి ఇంట్రాడేలో 6,640 స్థాయికి చేరుకుంది. గత ఏడేళ్లలో లేని లాభాలతో మారుతి మార్కెట్ క్యాపిటలైజేషన్ బిఎస్ఇలో రూ .1.99 లక్షల కోట్లకు పెరిగింది.ప్రభుత్వం అకస్మాత్తుగా ఉత్పత్తి రంగా మీద , పెట్టుబుడల ప్రాముఖ్యతపై దృష్టిపెట్టిందని, ఇది చాలా వినూత్నమైన, ముఖ్యమైన నిర్ణయమని మారుతి సుజుకి చైర్మన్ ఆర్‌సి భార్గవ పేర్కొనడం విశేషం. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కేపిటలైజేషన్(విలువ)కు రూ. 7 లక్షల కోట్లకు చేరగా, వెరసి మార్కెట్ విలువ రూ. 1.45 ట్రిలియన్లను దాటేసింది.
Comments
Please login to add a commentAdd a comment