
సైనిక దాడిలో గర్భిణి మృతి.. శిశువును కాపాడిన వైద్యులు
గాజా: ఇజ్రాయెల్ దాడుల్లో గాజా నగరం శిథిలాల దిబ్బగా మారుతోంది. తాజా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కనీసం 85 మంది పాలస్తీనీయుల మృతదేహాలను వెలికితీశారు. ఈ సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ దళాలకు, పాలస్తీనాలోని హమాస్ వర్గానికి మధ్య జరుగుతున్న పోరులో దాదాపు 1000 మంది చనిపోయారు. గాజా నగరంలో ఎటు చూసినా హృదయ విదారక సంఘటనలే.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 23 ఏళ్ల గర్భిణి మరణించింది. ఇంటి శిథిలాల కింద పడిఉన్న ఆమె మృతదేహాన్ని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేసి మహిళ గర్భంలో ఉన్న శిశువును రక్షించారు.